రాష్ట్రం కాదు.. దేశం కాదు.. ప్రపంచమే కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతుంది. కరోనా వైరస్ రక్కసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుండగా.. ఉగ్రవాదులకు మాత్రం ఇది ఏ మాత్రం అడ్డు కావట్లేదు. దేశంలో దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారు. ఢిల్లీలోని తిహార్ జైలు వేదికగా ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు కొందరు ఉగ్రవాదులు. హైదరాబాద్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది దీనికి పథకం రచిస్తుండగా ఇరాన్‌కు చెందిన ఉద్రవాద జంట ఈ విషయం గుట్టువిప్పింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది తిహార్ జైల్లో ఖైదీగా ఉంటూ ఓ వర్గం యువతకు ఉగ్రపాఠాలు నేర్పిస్తున్నాడు. యువతను ఉద్రదాడులకు పాల్పడేలా మోటివేట్ చేస్తున్నాడు. అయితే అదే జైల్లో శిక్ష అనుభివస్తున్న ఇరాన్ ఖొరాసన్ మోడ్యూల్‌కు చెందిన జంట ఉగ్రదాడి కుట్ర గురించి పోలీసులుకు సమాచారం అందివ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ విచారణ జరపగా.. ఉగ్రవాది కుట్రను బయపెట్టాడు. గతంలో ఐసిస్‌లో చేరేందుకు సిరియా వెళ్ళడానికి యత్నించి మహారాష్ట్రలో పోలీసులకు చిక్కాడు అతడు. దేశంలో స్వతహాగా దాడులకు దిగేలా యువతను ప్రేరేపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితున్ని 2018లో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.