Terrorists Shoot Dead Sikh School Principal And Hindu Teacher
Sikh School Principal, Hindu Teacher : ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కశ్మీర్ లో ముష్కర మూకల దాడులకు తెగబడుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్న వారు…వ్యూహాన్ని మార్చేశారు. సాధారణ పౌరులపై కాల్పులకు దిగుతున్నారు. మంగళవారం రాత్రి శ్రీనగర్ లో వేర్వేరు చోట్ల తీవ్రవాదులు దాడులు చేసి ముగ్గురిని హత్య చేసిన సంగతి తెలిసిందే. గంట వ్యవధిలో ఈ ముగ్గురిని ముష్కరులు తుపాకితో కాల్చి చంపారు. తాజాగా..ఇద్దరు ప్రభుత్వ టీచర్లను చంపేశారు. ఇందులో మహిళా టీచర్ ఉన్నారు. ఒకరు కశ్మీర్ పండిట్ కాగా..మరొకరు సిక్కు మహిళగా గుర్తించారు.
Read More : London-Kochi : విమానంలో మహిళకు పురిటి నొప్పులు, డెలివరీ ఎవరు చేశారంటే
శ్రీనగర్ లోని సంఘం ఈద్గా వద్ద..ఇద్దరు స్కూల్ టీచర్లను ఉదయం 11.15 గంటలకు హతమార్చారు. ముస్లిం టీచర్లను గ్రూపు నుంచి వేరు చేసి…ముస్లిమేతర టీచర్లను స్కూల్ నుంచి బయటకు లాగారు. అనంతరం వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Read More : Drug Case : ఆర్యన్ ఖాన్ కు జైలా ? బెయిలా ?
ఘటనా ప్రదేశాన్ని మూసివేశారు. అక్కడి భద్రతను పర్యవేక్షించడానికి డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాఠశాలకు చేరుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా…టీచర్ల హత్య ఘటనను ఖండించారు. వారి ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓ కశ్మీర్ పండిట్ ను మంగళవారం దారుణంగా కాల్చి చంపారు. రాత్రి ఏడు గంటల సమయంలో…పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చారు.