Central Government : జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత ఆస్తులు కొన్న బయటి వ్యక్తులు ఎందరంటే?

స్థానిక ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 34 మంది జమ్మూకశ్మీర్ యేతర పౌరులు ఆస్తులు కొనుగోలు చేసినట్టు నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

Jammu And Kashmire

Central Government : జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత ఆస్తులు కొన్న బయటి వ్యక్తుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 34 మంది బయటి వ్యక్తులు జమ్మూకాశ్మీర్ లో ఆస్తులు కొనుగోలు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో వివరాలు వెల్లడించారు.

స్థానిక ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 34 మంది జమ్మూకశ్మీర్ యేతర పౌరులు ఆస్తులు కొనుగోలు చేసినట్టు నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
PM Modi : జమ్మూ కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా!

జమ్మూ, రియాసి, ఉదంపూర్, గందర్బల్ జిల్లాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 2019 ఆగస్టు5న జమ్మూకశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.