Nalli Silks
Nalli Silks : ఇటీవల నల్లి సిల్క్స్ రిలీజ్ చేసిన యాడ్ వివాదాస్పదమైంది. జనం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో నల్లి సిల్క్స్ మరో కొత్త యాడ్ విడుదల చేసింది. దానిని నటుడు సోని శ్రీవాస్తవ షేర్ చేసారు.
Ram Charan : నాన్నని చూసి నేర్చుకున్నాను.. రామ్ చరణ్ కొత్త యాడ్ ఎమోషనల్‌గా..
అక్టోబర్, నవంబర్ నెలలు రాగానే కొన్ని బ్రాండ్‌లు కుటుంబ వేడుకలు, కొన్ని సంప్రదాయాల నేపథ్యంలో యాడ్స్‌ని రిలీజ్ చేస్తాయి. అలాగే ప్రముఖ బ్రాండ్ నల్లి సిల్క్స్ తమ కొత్త డిజైన్లను ప్రచారం చేయడానికి ఇటీవల ఒక యాడ్‌ను రిలీజ్ చేసింది. అందులో అందమైన చీర కట్టుకున్న మోడల్ బొట్టు పెట్టుకోకుండా కనిపించిన యాడ్ చూసి జనాలు నిరాశ పడ్డారు. #NoBindiNoBusiness అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం ప్రారంభించారు. నవరాత్రుల వేళ ఒక వర్గం ప్రజలకు ఈ యాడ్ ఆగ్రహం కూడా తెప్పించింది. కొందరు ఈ బ్రాండ్‌ను బహిష్కరిస్తాం అని కూడా వ్యాఖ్యలు చేసారు.
Allu Arjun : బన్నీ భార్యకు పుట్టిన రోజుకి గిఫ్ట్ గా.. క్రిష్ – అల్లు అర్జున్ యాడ్ రిలీజ్
చాలా విమర్శల తర్వాత నల్లి సిల్క్స్ మరో యాడ్ రిలీజ్ చేసింది. దానిని నటుడు శ్రీవాస్తవ షేర్ చేసారు. క్లిప్‌లో చాలామంది మోడళ్లు నల్లి సిల్క్ చీరలు ధరించి, నగలు మరియు బొట్టును ప్రదర్శిస్తారు. ఒక స్త్రీ తన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం, మరికొందరు కాజల్ పెట్టుకోవడం, ముక్కుపుడకలు, చెవి పోగులు ధరించడం అలా ఈ యాడ్‌లో కనిపించింది. మొత్తానికి వివాదాస్పదమైన యాడ్ స్ధానంలో కొత్త యాడ్ రీ ప్లేస్ చేసి గొడవ సర్దుమణిగేలా చేసింది సదరు కంపెనీ.
Did not expect this from @NalliSilk.
Where is the Bindi? #NoBindiNoBusiness pic.twitter.com/NmydqXydF9
— Kamal Vedā / कमल वेदा (@iKamalVeda) October 18, 2023