Allu Arjun : బన్నీ భార్యకు పుట్టిన రోజుకి గిఫ్ట్ గా.. క్రిష్ – అల్లు అర్జున్ యాడ్ రిలీజ్

పుష్ప సినిమాతో నార్త్ లో బన్నీ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవడంతో ఇప్పుడు నార్త్ రెడ్ బస్ యాడ్ కి కూడా అల్లు అర్జున్ నే తీసుకోవడం విశేషం.

Allu Arjun : బన్నీ భార్యకు పుట్టిన రోజుకి గిఫ్ట్ గా.. క్రిష్ – అల్లు అర్జున్ యాడ్ రిలీజ్

Allu Arjun Krish Jagarlamudi Red Bus Bollywood Ad Released on Sneha Reddy Birthday

Updated On : September 29, 2023 / 12:52 PM IST

Allu Arjun : గత రెండు రోజులుగా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) తో బన్నీ ఒక సినిమా చేయబోతున్నాడంటూ ఒక పోస్టర్, వీడియో వైరల్ అయింది. ‘కబీ అప్నే, కబీ సప్నే’ అనే టైటిల్ తో ప్రమోషన్స్ కూడా చేయడంతో కొంతమంది దీనిని సినిమా అనుకున్నా ఇది యాడ్ అని అర్థమైపోయింది. తాజాగా నేడు ఆ యాడ్ రిలీజ్ చేశారు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బన్నీ రెడ్ బస్ కి యాడ్ చేశారు. ఒక యాడ్ లో రెడ్ బస్(Red Bus) వల్ల డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అని చూపించారు. ఇంకో యాడ్ లో రెడ్ బస్ అంటే మన గర్వం అన్నట్టు డిజైన్ చేశారు. అయితే ఈ యాడ్స్ నార్త్ కోసం డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అందుకే ఇవి కేవలం హిందీలోనే ఉన్నాయి. ఇక గతంలో కూడా రెడ్ బస్ తెలుగు యాడ్స్ కి అల్లు అర్జున్ నటించారు.

పుష్ప(Pushpa) సినిమాతో నార్త్ లో బన్నీ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవడంతో ఇప్పుడు నార్త్ రెడ్ బస్ యాడ్ కి కూడా అల్లు అర్జున్ నే తీసుకోవడం విశేషం. దీంతో అభిమానులు బాలీవుడ్ లో కూడా బన్నీ యాడ్స్ చేసేస్తున్నాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి(Sneha Reddy) పుట్టిన రోజు కావడంతో ఈ రోజే ఆ యాడ్స్ ని అల్లు అర్జున్ అధికారికంగా రిలిజ్ చేసి భార్యకి గిఫ్ట్ ఇచ్చాడు అంటున్నారు.

Also Read : Skanda Collections : అదిరిపోయిన ‘స్కంద’ ఫస్ట్ డే కలెక్షన్స్.. రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్.. .

అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో భార్యతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేసి హ్యాపీ బర్త్‌డే మై క్యూటీ, నా లైఫ్ కి నువ్వే వెలుగువి అన్నట్టు పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. పలువురు అభిమానులు, నెటిజన్లు స్నేహారెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తన భార్యతో లండన్ కి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.