Indian Parliament: భారత పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్ళు

భారత పార్లమెంట్ ఉగ్రదాడి జరిగి సరిగ్గా 20ఏళ్ల కావొస్తుంది. ఈ దాడి గురించి గుర్తు చేసుకుని రాష్టప్రతి, ఉప రాష్ట్రపతి, హోం మంత్రి, రక్షణ మంత్రి అమరులైన వారికి నివాళులర్పించారు.

Indian Parliament: భారత పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్ళు

Indian Parliament

Updated On : December 13, 2021 / 9:56 AM IST

Indian Parliament: భారత పార్లమెంట్ ఉగ్రదాడి జరిగి సరిగ్గా 20ఏళ్ల కావొస్తుంది. ఈ దాడి గురించి గుర్తు చేసుకుని రాష్టప్రతి, ఉప రాష్ట్రపతి, హోం మంత్రి, రక్షణ మంత్రి అమరులైన వారికి నివాళులర్పించారు.

ఆ రోజు సుమారు 30 నిమిషాల పాటు ఉగ్రదాడి కొనసాగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో 10 మంది అమరులయ్యారు. ఐదుగురు ఢిల్లీ పోలీసులు, పార్లమెంట్ వాచ్ అండ్ వార్డ్ విభాగానికి చెందిన ఇద్దరు భద్రతా సహాయకులు, ఒక సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, ఫోటో జర్నలిస్టు, తోటమాలి అమరులైనట్లు అధికారులు తెలిపారు.

భద్రతా దళాలు చేతిలో ఉగ్రదాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

సైనికుల అత్యున్నత త్యాగానికి దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
– రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి

భద్రతా దళాల అసమానమైన శౌర్యం, అమర త్యాగం దేశానికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తినిస్తుంది.
– అమిత్ షా, హోంమంత్రి

భద్రతా దళాల అత్యున్నత త్యాగానికి జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఉగ్రవాదం మానవాళికి, ప్రపంచ శాంతికి ముప్పు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అన్ని దేశాలు ఎప్పుడూ ఐక్యంగా ఉండాలి.
– వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి