IGI Airport: విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు.. అరెస్టుకు రంగంసిద్ధం

గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ఓ వృద్ధురాలు ప్రయాణిస్తుంది. అయితే ఆమె పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులోఉన్న ఆ వ్యక్తి వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న డీజీసీఏ, ఢిల్లీ పోలీసులు నిందితుడిని గుర్తించారు. అరెస్టు చేసేందుకు రంగం సిద్ధంచేసినట్లు తెలిసింది.

Air India

IGI Airport: గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ఓ వృద్ధురాలు ప్రయాణిస్తుంది. అయితే ఆమె పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులోఉన్న ఆ వ్యక్తి వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనపై క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేయగా, సత్వరమే చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించింది. అయితే, బాధితుడిపై ఎయిర్ ఇండియా సిబ్బంది పోలీసుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపట్ల ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన.. సిబ్బంది ఏం చేశారంటే..

కాగా.. తనకు ఎదురైన ఇబ్బందిపై మహిళా ప్రయాణీకురాలు.. ఎయిర్ ఇండియా చైర్మన్‌కు లేఖ రాసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది. తనపై ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించినా విమాన సిబ్బంది సరిగా పట్టించుకోలేదని, దీంతో నేను తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ లేఖ ద్వారా తెలిపింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ( ఐజీఐ ఎయిర్ పోర్ట్) పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఘటన సమయంలో విమానంలో ఉన్న ఎయిర్ లైన్స్ సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేయన్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నలుగురు సిబ్బందికి పోలీసులు నోటీసులు పంపించారు. వీరి వాగ్మూలాలను పోలీసులు నమోదు చేస్తారు. మరోవైపు రెండవ విడతలో మహిళ పక్కన ఉన్న ప్రయాణికుల వాగ్మూలాలను సేకరిస్తారు.

 

ఈ ఘటనపై ఎయిరిండియా ప్రకటన చేసింది. 30 రోజులు తమ విమానాల్లో ప్రయాణించకుండా ఆ వ్యక్తిపై నిషేదం విధించింది. మరోవైపు ఆ ప్రయాణికుడి కోసం ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితుడు ఎవరనేది గుర్తించిన పోలీసులు, అరెస్టు చేయడానికి రంగం సిద్ధంచేసినట్లు తెలిసింది.