Mumbai : ప్రపంచంలో అత్యంత సంపన్న బిచ్చగాడు భారతీయుడేనట.. ఏ సిటీలో ఉన్నాడంటే..

ఓ బిచ్చగాడు ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడట.. అతను భారతీయుడట.. ముంబయిలో ఉంటాడట.. ఆశ్చర్యపోతున్నారు కదా.. అతని ఆస్తుల విలువ తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు.

Mumbai

Mumbai : చాలామంది బిచ్చం అడిగేవారిలో సంపన్నులు ఉన్నారట అనే మాట మీరు వినే ఉంటారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడైన బిచ్చగాడు ఇండియాలోనే ఉన్నాడు. మహారాష్ట్ర థానేకి చెందిన భరత్ జైన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి.

Mumbai : తాగి పారేసిన టెట్రా పాక్ డబ్బాలతో స్కూలు డెస్క్‌లు, బెంచీలు.. నిరుపేద విద్యార్ధులకు ముంబయివాసుల సాయం

భిక్షాటన వృత్తిగా మార్చుకుని కొందరు డబ్బు గడిస్తున్నారు అని విని ఉంటారు. కానీ ఇప్పుడు భరత్ జైన్ గురించి తెలిసి ఆశ్చర్యపోతారు. మహారాష్ట్ర థానేకి చెందిన భరత్ జైన్ ఆస్తుల విలువ రూ.7.5 కోట్లట. అతని నెలసరి సంపాదన రూ.60,000 నుంచి రూ.80,000 దాకా ఉంటుందట. ఇక ముంబయిలో అతనికి రెండు ప్లాట్లు ఉన్నాయట. అవి రూ.1.4 కోట్ల విలువ చేస్తాయట. థానేలోనే రెండు షాపుల్ని కొనుగోలు చేశాడట. వాటి ద్వారా నెలకు రూ.30,000 అద్దెలు కూడా వస్తాయట. కొన్ని షాపుల్లో పెట్టుబడులు కూడా పెట్టాడట. షాకవుతున్నారు కదా.

Mumbai Police : స్పైడర్ మ్యాన్ మూవీ క్లిప్ వాడిన ముంబయి పోలీసులు .. పైరేటెడ్ సినిమాలు డౌన్ లోడ్ చేయడం నేరం కాదా? అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు

భరత్ చిన్నతనంలో ఆర్ధిక పరిస్థితులు బాగోలేక చదువుకోలేకపోయాడట. తనలా తన బిడ్డలు కాకూడదని పిల్లల్ని బాగా చదివించి వారికి పెళ్లిళ్లు చేసాడట. ఇక భరత్ కుటుంబంలోని ఇతర సభ్యులు స్టేషనరీ స్టోర్ నిర్వహిస్తున్నారట. భరత్ జైన్ ఎక్కువగా ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్ లో ఎక్కువగా భిక్షాటన చేస్తాడట. ప్రస్తుతం పరేల్ లో ఉంటున్న భరత్ ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన బిచ్చగాడు.