Lockdown In Maharashtra : విజృంభిస్తున్న కరోనా…లాక్‌డౌన్‌ దిశగా మహారాష్ట్ర

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో.. సగం ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌... కరోనా కట్టడికి మహారాష్ట్ర సర్కార్‌ ముందున్న ఏకైక ఆయుధం.

lockdown in Maharashtra : లాక్‌డౌన్‌… కరోనా కట్టడికి మహారాష్ట్ర సర్కార్‌ ముందున్న ఏకైక ఆయుధం. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో.. సగం ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా విపరీతంగా కేసులు నమోదవుతున్న తీరు.. యావత్ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో.. లాక్‌డౌన్‌ పెట్టాలా..? వద్దా..? ఇప్పుడిదే ప్రశ్న అక్కడి ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. కరోనా కట్టడికి ఆంక్షలు పెట్టాల్సిందేనని సర్కార్‌ భావిస్తోంది. లాక్‌డౌన్‌పై ఉద్ధవ్‌ సర్కార్‌ ఇవాళే కీలక నిర్ణయం ప్రకటించే చాన్స్‌ ఉంది.

కరోనా కేసులు వెల్లువెత్తుతున్న వేళ.. సంపూర్ణ లాక్‌డౌన్‌వైపే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పెట్టాలా వద్దా అన్న అంశంపై ఇప్పటికే అఖిలపక్షం.. టాస్క్‌ఫోర్స్‌ సలహాలు తీసుకున్న ఉద్ధవ్‌.. నేడు మరోసారి టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌తో సమావేశం కానున్నారు. ఆ తర్వాతే లాక్‌డౌన్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ మినహా వేరే గత్యంతరం లేదంటున్నారు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే. ఈ నెల 15 నుంచి 20 వరకు పరిస్థితి భయానకంగా ఉంటుందన్న ఉద్ధవ్‌.. లాక్‌డౌన్‌తోనే కరోనాను కట్టడి చేయొచ్చని చెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి కరోనా పాజిటివ్‌గా వస్తోందన్నారు థాక్రే. ప్రభుత్వం ఎన్ని రకాలుగా కట్టడి చర్యలు తీసుకుంటున్నా.. కేసుల నమోదులో రోజుకో కొత్త రికార్డ్‌ సృష్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్‌ సర్కార్‌ 15 రోజుల పూర్తి లాక్‌డౌన్‌ విధించే అవకాశం కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు