Union Home Ministry : డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌చిట్‌..సమీర్‌ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు

డ్రగ్స్‌ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయ్యాడు. ఈ కేసులో తొలుత ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో సమీర్‌ వాంఖడేపై అనేక ఆరోపణలు వచ్చాయి.

Union Home Ministry : డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌చిట్‌..సమీర్‌ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు

Sameer Wankadhe

Updated On : May 28, 2022 / 12:31 PM IST

Union Home Ministry : డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌చిట్‌ లభించడంతో ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసులో పేలవంగా దర్యాప్తు చేపట్టినందుకుగాను… సమీర్‌ వాంఖడేపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు ఆయన తప్పుడు కులధ్రువపత్రాల ఆరోపణలపైనా చర్యలు చేపట్టనున్నట్టు కేంద్ర హోంశాఖలో కీలక అధికారి తెలిపారు.

డ్రగ్స్‌ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయ్యాడు. ఈ కేసులో తొలుత ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో సమీర్‌ వాంఖడేపై అనేక ఆరోపణలు వచ్చాయి. డబ్బులు గుంజేందుకే ఆర్యన్‌ను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారంటూ ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్ ఆరోపించారు. అంతేకాదు.. వాంఖడే ముస్లిం అని, ఉద్యోగం పొందేందుకు ఎస్సీగా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారంటూ ఆరోపణలు చేశారు.

Aryan Khan: డ్రగ్స్ కేసు.. ఆర్యన్ ఖాన్‌కు క్లీన్‌చిట్

అనంతరం డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు నిమిత్తం ఎన్‌సీబీ సిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో అతడికి క్లీన్‌ చిట్‌ ఇస్తున్నట్లు ఎన్‌సీబీ శుక్రవారం.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశించడం ఆసక్తిగా మారింది.