Siddaramaiah: గాంధీనే చంపారు.. నన్ను విడిచి పెడతారా? బీజేపీపై సంచలన వ్యాఖ్యలు

ఈ మధ్య పడ్డ అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి గురువారం కొడగు వెళ్లారు సిద్ధరామయ్యా. అయితే సిద్ధూ పర్యటనను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నల్ల జెండాలు చూపిస్తూ ‘గో బ్యాక్ సిద్ధరామయ్య’ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో నుంచి కొందరు సిద్ధరామయ్య కారుపై గుడ్లు విసిరారు. ఈ నిరసన వల్ల సిద్ధరామయ్య కారు స్లోగా వెళ్తోంది. ఇంతలో బీజేపీ కార్యకర్తల్లో ఒక వ్యక్తి కారులోకి సావర్కర్ ఫొటోను విసిరాడు. అది ఆయన ఒళ్లో పడింది.

Siddaramaiah: జాతి పిత గాంధీనే చంపిన వ్యక్తులు తనను విడిపెడతారని అనుకోవడం లేదని కర్ణాటక ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కొడగు పర్యటనకు వెళ్లిన ఆయన కారుపై భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు గుడ్లు విసరడాన్ని గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో సిద్ధూ మాట్లాడుతూ ‘‘గాంధీని చంపిన వ్యక్తులు వాళ్లు. నన్ను వదిలి పెడతారా? గాడ్సే గాంధీని చంపాడు. కానీ వాళ్లు గాడ్సే ఫొటో ముందు మోకరిల్లుతారు. గాడ్సేని పూజిస్తారు’’ అని అన్నారు.

ఈ మధ్య పడ్డ అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి గురువారం కొడగు వెళ్లారు సిద్ధరామయ్యా. అయితే సిద్ధూ పర్యటనను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. నల్ల జెండాలు చూపిస్తూ ‘గో బ్యాక్ సిద్ధరామయ్య’ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో నుంచి కొందరు సిద్ధరామయ్య కారుపై గుడ్లు విసిరారు. ఈ నిరసన వల్ల సిద్ధరామయ్య కారు స్లోగా వెళ్తోంది. ఇంతలో బీజేపీ కార్యకర్తల్లో ఒక వ్యక్తి కారులోకి సావర్కర్ ఫొటోను విసిరాడు. అది ఆయన ఒళ్లో పడింది.

ఇది కర్ణాటకలో రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ విషయమై సిద్ధరామయ్య స్పందిస్తూ ‘‘నిరసనలు చేయడానికి అభ్యంతరం లేదు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని కర్ణాటక హోంమంత్రి అరాగా జ్ణానెంద్ర అన్నారు. నాపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. వాళ్లపై కూడా చర్యలు తీసుకుంటారా?’’ అని ప్రశ్నించారు. సిద్ధూ వ్యాఖ్యలపై హోమంత్రి అరాగా జ్ణానేంద్ర స్పందిస్తూ ‘‘ఇలాంటి చర్యల్ని మేం కూడా సమర్ధించం. పోలీసులకు సమాచారం అందించాం’’ అని తెలిపిన ఆయన.. ఇంకా మాట్లాడుతూ ఇలాంటి సంఘటనల్ని సాకుగా చూపించి సిద్ధరామయ్య రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

Covid-19 tests: మనుషులకే కాదు.. చేపలకు, పీతలకు కూడా కొవిడ్ టెస్ట్

ట్రెండింగ్ వార్తలు