Delhi Kalindi Kunj : మంచు కాదు, సబ్బు నురగ కాదు

మంచు కాదు, సబ్బునీటి నురగ కాదు, దూది కూడా కానే కాదు. యమునా నది. ప్రస్తుతం ఇలా తయారవుతోంది. మురికి నీటిని యమునా నదిలో వదలడం వల్ల..వచ్చిన నురగ. ఈ నీరు చాలా ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

Delhi Yamuna

Yamuna River At Kalindi Kunj : మంచు కాదు, సబ్బునీటి నురగ కాదు, దూది కూడా కానే కాదు. యమునా నది. ప్రస్తుతం ఇలా తయారవుతోంది. మురికి నీటిని యమునా నదిలో వదలడం వల్ల..వచ్చిన నురగ. ఈ నీరు చాలా ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంతో పాటు నీటి కాలుష్యం కూడా అధికమౌతోంది. వివిధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, మురికినీరు యమునా నదిలోకి నీరంతా కలుషితమవుతోంది. విష రసాయనాల కారణంగా..యమునా నదిలో విషపు నురుగులు పేరుకపోతున్నాయి. కలింది కుంజ్ (Kalindi Kunj) ఏరియాలో 2021, జూన్ 06వ తేదీ ఆదివారం ఉదయం నదిపై విషపు నురుగులు దర్శనమిచ్చాయి.

యుమనా నది..ఇందులో స్నానం ఆచరిస్తే..అకాల మృత్యుదోషం పోతుందని పెద్దలు అంటుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే..ఇందులో స్నానం చేస్తే మృత్యువు ఖాయంగా అనిపిస్తోంది. యమునా పరీవాహక ప్రాంతాలలో యమునా నగర్, ఢిల్లీ, మధుర, ఆగ్రా, ఇటావా, అలాహాబాద్‌ నగరాలు ఉన్నాయి. ఢిల్లీలో 22 కిలోమీటర్ల మేర..యమునా నది ప్రవహిస్తుంటుంది.

ఇది అత్యంత కాలుష్య నదిగా మారిపోతోంది. యమునా నది చుట్టుపక్కల పల్లెల్లో భూగర్భ జాలు విషతుల్యమవుతున్నాయని, ఫలితంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని అంటున్నారు. అయినా..యమునా నదిపై ఉన్న భక్తితో పుణ్యస్నానాలు, సంధ్య వారుస్తుంటారు. మరి యమునా నది కాలుష్యం నుంచి ఎప్పటికి విముక్తి అవుతుందో…

Read More : Mother’s Love: కొడుకు కోసం రెండు వంతెనలు నిర్మిస్తోన్న తల్లి