×
Ad

విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట జరుగుతుందని ముందే చెప్పిన వ్యక్తి.. పాత వీడియో వైరల్..

ఆ వ్యక్తి చెప్పినట్లే జరగడంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Stampede At TVK Chief Vijay

Karur stampede: తమిళనాడులోని కరూరులో నిన్న టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.

దేశాన్ని కలిచివేస్తున్న ఈ తొక్కిసలాట ఘటన గురించి ఓ వ్యక్తి రెండు వారాల ముందే చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

“తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి కనీసం ఒక్క తొక్కిసలాటైనా జరిగి తీరుతుంది. అందులో కనీసం 50 మంది యువత బలైపోతారు. వీటన్నింటికీ విజయ్ అనే దుర్మార్గుడే కారణం అవుతాడు.

బుద్ధిలేని, క్రూరమైన, ఆటవికుల వంటివారు వారు వీరు. డీఎంకే కంటే 10 రెట్లు విషపూరిత వ్యక్తులు వీరు. రాజకీయాల్లో ప్రతిపక్షం, కూటమి భాగస్వాములు పరస్పరం బురద చల్లుకుంటూ ఉండటం రాష్ట్ర రాజకీయాల్లోని మూర్ఖత్వాన్ని సూచిస్తుంది” అని ఆ వ్యక్తి చెప్పారు.

కాగా, తొక్కిసలాట ఘటనపై మద్రాస్‌ హైకోర్టు ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు అత్యవసర పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. విజయ్‌ స్థాపించిన తమిళగ వెట్ట్రి కజగం (టివికె)కు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి ఇవ్వకుండా తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌/హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్‌ను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. కరూర్‌లో 40 మంది మరణించిన ఘటనపై దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆంక్షలు విధించాలనే అభ్యర్థన పెట్టారు.