Beggar Basya : యాచకుడి అంతిమ యాత్రకు వేలాదిగా తరలివచ్చిన జనం

ఓ యాచకుడి అంతిమయాత్రకు ప్రజలు తండోతండాలుగా తరలివచ్చారు. ఈ సంఘటన కర్ణాటకలోని విజయ్‌నగర్ జిల్లా హడగలి పట్టణంలో చోటుచేసుకుంది.

Beggar Basya : యాచకుడి అంతిమ యాత్రకు వేలాదిగా తరలివచ్చిన జనం

Beggar Basya

Updated On : November 18, 2021 / 6:42 AM IST

Beggar Basya :  ఓ యాచకుడి అంతిమయాత్రకు ప్రజలు తండోతండాలుగా తరలివచ్చారు. ఈ సంఘటన కర్ణాటకలోని విజయ్‌నగర్ జిల్లా హడగలి పట్టణంలో చోటుచేసుకుంది. బస్యా (45)  హడగలి పట్టణంలో యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత 20 ఏళ్లుగా ఈ పట్టణంలోని ప్రజలకు బస్యా సుపరిచితుడు. యితడు అందరిలా ఎంత ఇస్తే అంత తీసుకోడు.. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకోని మిగతావి వెనక్కు ఇచ్చేస్తుంటాడు.

చదవండి : Fake Begger: నకిలీ భిక్షగాడు.. తన వెనకో పెద్ద గ్యాంగ్!

ఇక అతడికి సాయం చేస్తే మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే అతడికి రూపాయి ఇచ్చి చేతులు దులుపుకోకుండా భోజనం పెడుతుంటారు. ఆలా అందరితో కలివిడిగా ఉండే బస్యాను కొద్దీ రోజుల క్రితం బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.. అయితే బస్యా ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన పట్టన ప్రజలు ఆయన అంత్యక్రియలకు తండోపతండాలుగా తరలివచ్చారు.

చదవండి : Karnataka : ఎమ్మెల్యేని మార్చేయ్..నా భర్త మందు మానేలా చూడు..దేవుడికి కోర్కెలు

బస్యా అంతిమ యాత్రలో రోడ్లన్నీ ప్రజలతో నిండిపోయాయి. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ సాధారణ యాచకుడి అంత్యక్రియలకు ఈ విధంగా ప్రజలు రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఆయన ఆస్తులు సంపాదించకపోయిన వేలమంది అభిమానం సంపాదించారంటూ నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.