Abhishek
Coal Scam: పశ్చిమబెంగాల్లో బొగ్గు కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విచారణ కొనసాగుతుంది. సోమవారం ఈడీ అధికారులు ఎంపీ అభిషేక్ బెనర్జీని ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. విచారణలో భాగంగా అభిషేక్ బెనర్జీ భార్యకు మరియు అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్న రెండు సంస్థల విదేశీ బ్యాంకు ఖాతాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈవ్యవహారంలో అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీ మంగళవారం విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించారు.
Also Read: TPCC : చలో ఢిల్లీ అంటున్న టి.కాంగ్రెస్ సీనియర్ నేతలు
అభిషేక్ బెనర్జీ కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి రెండు సంస్థల ద్వారా వచ్చిన ఆదాయంలో లెక్కకు చూపని లావాదేవీల గురించి ఈడీ ప్రశ్నించింది. అయితే ఈడీ విచారణకు అభిషేక్ బెనర్జీ విచారణకు సహకరించడం లేదని విచారణకు సంబంధం ఉన్న అధికారి ఒకరు జాతీయ మీడియాతో అన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ..తన తండ్రి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రెండు కంపెనీల ద్వారా బొగ్గు అక్రమ రవాణాకు పాల్పడి భారీగా ఆదాయం ఆర్జించినట్లు ఈడీ ప్రధాన అభియోగం. అయితే ఈ అభియోగాలపై విచారణ నిలిపివేయాలంటూ అభిషేక్ అతని భార్య ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించగా..న్యాయస్థానం తిరస్కరించింది.
Also Read: Goa Chief Minister: గోవా సీఎంగా కొనసాగనున్న ప్రమోద్ సావంత్
ఈడీ విచారణ అనంతరం బయటకు వచ్చిన అభిషేక్ బెనర్జీ.. తాను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు. తనపై కక్ష సాధింపుగానే ఈ కేసులు పెట్టారని ఆయన అన్నారు. నాపై ఆరోపణలు చేస్తున్న వారు 10 పైసల ఆరోపణల రుజువు చేయలేరని తాను అప్పుడే చెప్పానని.. ఆరోపణలు రుజువు చేయగలిగితే ఈడీ-సీబీఐ అవసరం లేకుండా నేరుగా ఉరిశిక్ష వేసిన స్వీకరిస్తానని అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈడీకి కోల్‌కతాలోనూ కార్యాలయం ఉందని అయితే ఢిల్లీలోనే విచారం చేపట్టడంపై బీజేపీ కుట్ర దాగి ఉందని అభిషేక్ ఆరోపించారు. తనకు ఇటీవల కంటి శస్త్రచికిత్స జరిగినదని.. మరో రెండు రోజుల్లో ఇంకో శస్త్రచికిత్స జరగనుందని.. అయినా ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని అభిషేక్ బెనర్జీ తెలిపారు.
Also Read: AB Venkateswararao : 2019 మే వరకు ఏ ప్రభుత్వం కూడా పెగాసస్ కొనలేదు- ఏబీ వెంకటేశ్వరరావు