AB Venkateswararao : 2019 మే వరకు ఏ ప్రభుత్వం కూడా పెగాసస్ కొనలేదు- ఏబీ వెంకటేశ్వరరావు

పెగాసస్ అంశం వల్ల ప్రజల్లో అభద్రతాభావం కలుగుతోందని AB Venkateswararao ఆందోళన వ్యక్తం చేశారు. పెగాసస్ ను కొనడం, వాడడం చేయలేదని తేల్చి చెప్పారు.

AB Venkateswararao : 2019 మే వరకు ఏ ప్రభుత్వం కూడా పెగాసస్ కొనలేదు- ఏబీ వెంకటేశ్వరరావు

Ab Venkateswararao

AB Venkateswararao : పెగాసస్ స్పైవేర్ కొనుగోలు అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రస్తుతం ఏపీలో పెగాసస్ అంశం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలో పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేశారంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

పెగాసస్ స్పై వేర్ కొనుగోలు అంశంపై ఏపీ అసెంబ్లీ అట్టుడుకుతోంది. విపక్ష టీడీపీ, అధికార వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెగాసస్ అంశంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చారు. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. పెగాసస్ అంశంలో సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.(AB Venkateswararao)

MLA Ambati : పెగాసేస్ స్పై వేర్ కొనుగోళ్లపై కేంద్రం విచారణ చేపట్టాలి : ఎమ్మెల్యే అంబటి

పెగాసస్ అంశం వల్ల ప్రజల్లో అభద్రతాభావం కలుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2019 మే ముందు వరకు ఏ ప్రభుత్వం కూడా పెగాసస్ ను వాడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కానీ, డీజీపీ కార్యాలయం కానీ, ఇంటెలిజెన్స్ విభాగం కానీ, మరే ఇతర ప్రభుత్వ విభాగం కానీ, ఏ ప్రైవేటు కార్యాలయం కానీ పెగాసస్ ను కొనడం కానీ, వాడడం కానీ చేయలేదని తేల్చి చెప్పారు. ఫోన్ల హ్యాకింగ్, ట్యాపింగ్ కాలేదని వెల్లడించారు.

అప్పటి ఏపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నందున తనకు పూర్తి సమాచారం ఉందన్నారు. అయితే, 2019 మే తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని ఆయన వెల్లడించారు. 2021 ఆగస్టు వరకు పెగాసస్ ను తాము కొనుగోలు చేయలేదని డీజీపీ ఆఫీసు కూడా వెల్లడించింది కాబట్టి, భయాందోళనలు వీడాలని ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు.

అయితే, అసలు ఎప్పుడూ కొనని సాఫ్ట్ వేర్ గురించి నేను సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు వెంకటేశ్వరరావు. పెగాసస్ అంశంలో సందేహాలు లేవనెత్తి ప్రజలను భయాందోళనలకు గురిచేయొద్దని హితవు పలికారు. దీనిపై సందేహాలను నివృత్తి చేయాల్సింది ప్రభుత్వమే అన్నారు. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిగా ప్రజల్లో ఉన్న ఆందోళనలు, భయాలు, సందేహాలను తొలగించాల్సిన బాధ్యత తనపై ఉందని భావిస్తున్నానని, అందుకే మీడియా ముందుకు వచ్చానని వెంకటేశ్వరరావు వెల్లడించారు.

Somireddy On Pegasus Spyware : పెగాసెస్ స్పైవేర్ చంద్రబాబు కొనుంటే, వివేకా హత్య జరిగేదే కాదు-సోమిరెడ్డి

2015 నుంచి 2019 మార్చి ఆఖరు వరకు తాను ఏపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశానని ఆయన తెలిపారు. ఆ తర్వాత మరో రెండు నెలల పాటు నిఘా విభాగంలో ఏం జరుగుతోందన్న దానిపై తనకు సమాచారం ఉందన్నారు.

కాగా, పెగాస‌స్‌పై.. హౌస్ కమిటీ, జ్యుడీషియరీ కమిటీ, సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని లోకేశ్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం శాస‌న‌మండలిలో వైసీపీ ప్ర‌తిపాదించిన మేర‌కు పెగాస‌స్ వ్య‌వ‌హారంపై స్వ‌ల్పకాలిక చ‌ర్చ‌కు మండ‌లి చైర్మ‌న్ అనుమ‌తి ఇచ్చిన నేపథ్యంలో లోకేశ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.