MLA Ambati : పెగాసేస్ స్పై వేర్ కొనుగోళ్లపై కేంద్రం విచారణ చేపట్టాలి : ఎమ్మెల్యే అంబటి

చంద్రబాబు అనైతిక రాజకీయ వేత్తని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ఫోన్లను టాప్ చేశారని గుర్తు చేశారు.

MLA Ambati : పెగాసేస్ స్పై వేర్ కొనుగోళ్లపై కేంద్రం విచారణ చేపట్టాలి : ఎమ్మెల్యే అంబటి

Ambati Rambabu

MLA Ambati Rambabu : పెగాసేస్ స్పై వేర్ కొనుగోళ్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చెయ్యాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పెగాసేస్ స్పై వేర్ కొనుగోళ్ల అంశాన్ని శాసన సభలో మమతా బెనర్జీ ఆన్ రికార్డ్ చెప్పారని పేర్కొన్నారు. టీడీపీ వారు పెగాసేస్ స్పై వాడినట్లు తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు.

ఇప్పుడు టీడీపీపై అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. అప్పుడు ఐటీ మినిస్టర్ గా ఉన్న లోకేష్ ఇప్పుడు తమపై మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. చంద్రబాబు అనైతిక రాజకీయ వేత్తని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ఫోన్లను టాప్ చేశారని గుర్తు చేశారు.

Ambati Rambabu : ప్రత్యేక హోదా తొలగింపు వెనుక చంద్రబాబు-అంబటి రాంబాబు

తమ ముఖ్యమంత్రి జనాకర్షణ ఉన్న నాయకుడు..చంద్రబాబుకు అంత లేదన్నారు. సింగిల్ గా వచ్చే దమ్ములేక పార్టీలతో కలిసి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్న లోకేష్.. మమతా బెనర్జీకి సమాధానం చెప్పాలన్నారు.

లిక్కర్ పై అంబటి రాంబాబు స్పందించారు. లిక్కర్ వాడకం తగ్గించడం కోసమే రేట్లు పెంచామని తెలిపారు. కొత్త పాలసీ అంటే కొత్త బ్రండ్లే వస్తాయని చెప్పారు. ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్ అంటూ అపహాస్యంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. లిక్కర్ అంటే ఎనర్జీ డ్రింక్ కాదు.. అతిగా తాగితే చస్తారని చెప్పారు.