Ambati Rambabu : ప్రత్యేక హోదా తొలగింపు వెనుక చంద్రబాబు-అంబటి రాంబాబు

ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండటాన్ని టీడీపీ ఎందుకు స్వాగతించలేదని నిలదీశారు. చంద్రబాబు ఆదేశాలతోనే ఎజెండాను మార్పించారని స్పష్టం అవుతోందని ఆరోపించారు.

Ambati Rambabu : ప్రత్యేక హోదా తొలగింపు వెనుక చంద్రబాబు-అంబటి రాంబాబు

Ambati Rambabu

Ambati Rambabu : ఏపీ విభజన సమస్యలపై ఈ నెల 17న త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసే సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని అజెండాలో చేర్చి మళ్లీ తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. సడెన్ గా.. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఎందుకు మారిందని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర విభజనకు సంబంధించి త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకొచ్చిన 9 అంశాలను మార్చాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రకటన చేశారని అంబటి మండిపడ్డారు. ఏపీకి అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే.. జీవీఎల్ ఎందుకంత హడావిడి పడ్డారని ప్రశ్నించారు. దీనిపై జీవీఎల్ నరసింహారావు వివరణ ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండటాన్ని టీడీపీ ఎందుకు స్వాగతించలేదని రాంబాబు నిలదీశారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లు చంద్రబాబు ఆదేశాలతోనే ఎజెండాను మార్పించారని స్పష్టం అవుతోందని అంబటి రాంబాబు ఆరోపించారు.

Android 12 Feature : ఈ స్మార్ట్ ఫోన్లలోకి కూల్ ఆండ్రాయిడ్ 12 ఫీచర్ వస్తోంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

‘‘అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే హోంమంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన అజెండా ఏమిటో తనకే తెలియదా? తన అధికారాలు ఏమిటో తమకే తెలియదా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధికారుల మధ్య ప్రత్యేక హోదా, రీసోర్సెస్‌ గ్యాప్‌ అన్నవి చర్చనీయ అంశాలు కాకపోయినా ఈ అంశాన్ని త్రిసభ్య కమిటీ నేరుగా ఏపీ అధికారులతో చర్చించవచ్చు కదా. మరి దాన్ని కూడా ఆపాలని ఎందుకు ప్రయత్నించారు?’’ అని అంబటి రాంబాబు ప్రశ్నలు గుప్పించారు.

ఆ కమిటీకి కేంద్ర హోం శాఖకు సంబంధించిన జాయింట్‌ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారని అంబటి వివరించారు. వారికి తమ పరిధిలోకి వచ్చే అంశాలు, రాని అంశాలు ఏవో తెలియదంటూ వెంటనే జీవీఎల్‌ రంగంలోకి దిగడం, ఆ వెంటనే బహిరంగంగా ప్రకటనలు చేయడం, ఆపైన కేంద్ర ప్రభుత్వ కమిటీ అజెండా మారిపోవడం ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మౌనం ఇవన్నీ చూస్తుంటే.. ఏం జరిగి ఉంటుందో అన్నది రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలని అంబటి అన్నారు. చంద్రబాబు శకుని పాత్రపై, ఆయన పంపించిన మనుషుల శకుని పాత్రలపై, పరిధులు మీరిన జీవీఎల్‌ ప్రకటనపై కచ్చితంగా చర్చ జరగాలన్నారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఊహించని షాకిచ్చింది. ఏపీ విభజనకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోం శాఖ ఈ నెల 17న సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ అజెండాలో ప్రత్యేక హోదా అంశం పెట్టడంతో ఏపీ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. అయితే, ఏపీ ప్రజల ఆశలపై సాయంత్రాని కల్లా కేంద్రం నీళ్లు చల్లింది. అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని తొలిగించింది. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పన్నురాయితీలు అనే అంశాలు లేవు. 9 అంశాల నుంచి 5 అంశాలకే ఎజెండాను పరిమితం చేసింది.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలకు సంబంధించి ఓ పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులతో విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 17న ఈ కమిటీ సమావేశం కానుంది.

Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?

ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల పెండింగ్ అంశాల పరిష్కారానికి త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యల మీద కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ వర్చువల్ గా నిర్వహించనున్నారు.