TPCC : చలో ఢిల్లీ అంటున్న టి.కాంగ్రెస్ సీనియర్ నేతలు

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ లో అసమ్మతి పెరిగిపోతోంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య మరింత తారాస్థాయికి చేరుకుంది. టి. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు.

TPCC : చలో ఢిల్లీ అంటున్న టి.కాంగ్రెస్ సీనియర్ నేతలు

Tpcc

Telangana Congress : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ లో అసమ్మతి పెరిగిపోతోంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య మరింత తారాస్థాయికి చేరుకుంది. టి. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. 2022, మార్చి 22వ తేదీ మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. మంగళవారం మాణిక్కం ఠాగూర్ తో భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నందున ఢిల్లీలో ఉత్తమ్ ఉన్నారు. మరోవైపు… TPCC వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతల జగ్గారెడ్డిని తొలగిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తొలగించింది. జగ్గారెడ్డిని నియోజకవర్గాల బాధ్యతల నుంచి తప్పించింది హస్తం అధిష్టానం. ఈ వ్యవహారంపై స్పందించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి.

Read More : MLA Jagga Reddy : జగ్గారెడ్డికి హైకమాండ్ షాక్.. ఆ బాధ్యతల నుంచి తొలగింపు

క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే.. ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీకి నష్టం జరిగేలా ఎవరు వ్యవహరించినా.. కార్యక్రమాలు చేసినా ఎంతటి వారైనా సహించేది ఉండదన్నారు మల్లు రవి. నిన్న జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ ఖచ్చితంగా పార్టీ లైన్ దాటినట్లు భావిస్తున్నానన్నారాయన. జగ్గారెడ్డి గతంలోనే తనను బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు.. అందుకే పీసీసీ నిర్ణయం తీసుకున్నారు క్లారిటీ ఇచ్చారు మల్లు రవి. ఇక.. ఆదివారం ప్రత్యేక మీటింగ్ పెట్టుకున్న ప్రతి ఒక్కరినీ ఏఐసీసీ పరిశీలిస్తోందని.. వారిపై కూడా తగిన సమయంలో చర్యలు ఉంటాయన్నారు. మరి టి. కాంగ్రెస్ సీనియర్ నేతల ఢిల్లీ పర్యటన అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.