తమిళనాడు ఎన్నికల బరిలో…ఉదయనిధి స్టాలిన్V/S ఖుష్బూ

TN elections ఏప్రిల్-6న జరుగనున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే చీఫ్ ఎమ్ కే స్టాలిన్ కుమారుడు, ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఏప్రిల్-6న జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నెలోని ’చెపాక్’ నియోజకవర్గం నుంచి డీఎంకే తరుపన ఉదయనిధి స్టాలిన్ పోటీ చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 7న తిరుచిరాపల్లిలో జరగనున్న డీఎంకే సమావేశాల్లో ఉదయనిధి స్టాలిన్ పోటీ చేసే విషయమై అధికారికంగా ప్రకటించనున్నారు.

మరోవైపు, ఉదయనిధి స్టాలిన్ పై ఖష్బూని పోటీకి దించే ప్రయత్నంలో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఉంది. చెపాక్ నియోజవర్గం నుంచి ప్రముఖ నటి ఖుష్బూని బీజేపీ పోటీకి దించనున్నట్లు సమాచారం. చెపాక్ నియోజకవర్గం..డీఎంకేకి మంచి పట్టు ఉన్న ప్రాంతం. ఉదయనిధి తాత అయిన తమిళనాడు దివంగత సీఎం కరుణానిధి చెపాక్ నియోజకవర్గం నుంచే మూడు సార్లు పోటీ చేసి గెలిచారు. మరోవైపు, ఉదయనిధి స్టాలిన్ పై ఖష్బూని పోటీకి దించే ప్రయత్నంలో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఉంది. కూటమి తరపున చెపాక్ నియోజవర్గం నుంచి ప్రముఖ నటి ఖుష్బూని రంగంలోకి దించనున్నట్లు సమాచారం.

ఇక, ఈసారి కూడా డీఎంకే చీఫ్ స్టాలిన్..కొలత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. వరుసగా మూడోసారి ఆయన ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2011 మరియు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కొతత్తూర్ నియోజకవర్గం నుంచే పోటీచేసి విజయం సాధించిన స్టాలిన్ ఇప్పుడు మరోసారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. 2011కి ముందు థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగేవారు స్టాలిన్.

ట్రెండింగ్ వార్తలు