Soldiers at Border: ఎండల తీవ్రతకు సరిహద్దుల్లో సైనికులు ఎంత కష్టపడుతున్నారో తెలిపే ఘటన

అసలే ఏప్రిల్ - మే నెలల్లో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. మరి అంత వేడిలోనూ జవాన్లు దేశ రక్షణ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా.

Soldiers at Border: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు అతి వేడి గాలులు తప్పవంటూ వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ప్రజలైతే ఏసీలు, కూలర్లు పెట్టుకుని ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరి సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికుల సంగతేంటి?. అసలే ఏప్రిల్ – మే నెలల్లో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. మరి అంత వేడిలోనూ జవాన్లు దేశ రక్షణ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా. సరిహద్దులో ఎండ తీవ్రత తెలిపేలా బీఎస్ఎఫ్ జవాన్లు చేసిన ఒక ప్రయోగం అందరిని ఆలోచింపజేస్తుంది. రాజస్థాన్ లోని బికనీర్‌లో ఇండో-పాకిస్థాన్ సరిహద్దు వద్ద వేడి తీవ్రతను తెలియజేసేలా భారత సైనికులు ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read:SmritiIrani in Wayanad: రాహుల్ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ: వాయనాడ్ కూడా లాగేసుకుంటారా?

వీడియోలో, ఇద్దరు జవాన్లు తమ చేతుల్లో 2 పచ్చి అప్పడాలను ఇసుకలో పూడ్చిపెట్టారు. 10 నిమిషాల తర్వాత ఇసుకలో నుంచి వెలికి తీసిన అప్పడాలు పొయ్యిమీద వేయించిన అప్పుడల్లాగే వేయించబడ్డాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ తాము దేశ రక్షణ కోసం ఎంత కష్టపడుతున్నామో ప్రజలకు తెలియజేయడానికే ఈ వీడియో రూపొందించినట్లు ఒక సైనికుడు తెలిపారు. వేసవి నుంచి ఉపశమనం పొందేలా సైనికులకు వనరులను సమీకరించాలని విజ్ఞప్తి కూడా చేశారు. కాగా బికనీర్‌లో ఉష్ణోగ్రత 47 నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.

Also read:Cross-Border Tunnel : దేశ సరిహద్దుల్లో బ‌య‌ట‌ప‌డ్డ రహస్య సొరంగం.. బీఎస్ఎఫ్ అలర్ట్..!

రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతంకంటే నగరాల్లోనే ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు అవుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. బీఎస్ఎఫ్ డీఐజీ పుష్పేంద్ర సింగ్ ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ప్రతి ఎండాకాలం ఇక్కడ చాలా వేడిగా ఉంటుందని, కానీ మన సైనికుల ఆత్మస్థైర్యం..వేడి కంటే కఠినంగా ఉందని అన్నారు. మరోవైపు భరించలేని ఎండల నుంచి సైనికులను రక్షించేందుకు పహారాల గుడారాల వద్ద కూలర్లను అమర్చారు. ప్రతి పరంజా దగ్గర కూలర్‌ను ఏర్పాటు చేశారు. సోలార్ విద్యుత్ ద్వారా పనిచేస్తున్న ఈ కూలర్లలో నీరు పోయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. దీంతో సైనికులకు ఎంతో కొంత ఊరట లభించింది.

Also read:Kashmir valley: కాశ్మీర్‌ తీవ్రవాదుల చేతిలో అమెరికన్ ఆయుధాలు

ట్రెండింగ్ వార్తలు