SmritiIrani in Wayanad: రాహుల్ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ: వాయనాడ్ కూడా లాగేసుకుంటారా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. నేపాల్ నైట్‌క్లబ్‌లో ఖుషీగా గడుపుతున్న సమయంలో ఆయన సొంత పార్లమెంటు నియోజకవర్గం వాయనాడ్‌లో చిన్నపాటి రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

SmritiIrani in Wayanad: రాహుల్ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ: వాయనాడ్ కూడా లాగేసుకుంటారా?

Smriti

SmritiIrani in Wayanad: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. నేపాల్ నైట్‌క్లబ్‌లో ఖుషీగా గడుపుతున్న సమయంలో ఆయన సొంత పార్లమెంటు నియోజకవర్గం వాయనాడ్‌లో చిన్నపాటి రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి, బీజేపీ మహిళా సీనియర్ నేత స్మృతి ఇరానీ కేరళలోని వాయనాడ్ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో స్మృతి ఇరానీ ఇక్కడ పర్యటించడం చర్చనీయాంశమైంది. రాజకీయ అంశాలపై విస్లషణకు తాను ఇక్కడకు రాలేదని.. కేంద్ర మంత్రిగా.. కేంద్రం అందిస్తున్న పధకాల అమలు తీరు వాయనాడ్ లో ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకునేందుకే వచ్చినట్లు స్మృతి ఇరానీ పేర్కొన్నారు.

Also Read:Cross-Border Tunnel : దేశ సరిహద్దుల్లో బ‌య‌ట‌ప‌డ్డ రహస్య సొరంగం.. బీఎస్ఎఫ్ అలర్ట్..!

దాదాపు 30 గంటలపాటు వాయనాడ్ లో ఉన్న ఆమె కేంద్ర పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. వాయనాడ్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై ఇరానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిలో చదువు మానేసిన బాలికలను తిరిగి పాఠశాలకు వెళ్లేలా ప్రోత్సహించే ‘కన్యా శిక్ష ప్రవేశ ఉత్సవ్’ పథకం అసలు అమలుకు నోచుకోలేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. వాయనాడ్ కూడా రాహుల్ ఎంపీగా చేసిన అమేథీలా మారిందంటూ స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు.

Also read:Chidambaram: చిదంబరానికి కాంగ్రెస్ లాయర్ల నిరసన సెగ

ఉత్తరప్రదేశ్ లో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గాంధీల సారధ్యంలోని కాంగ్రెస్ ఎలా ‘విఫలం’ చెందిందనే దాని గురించి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా విడుదల చేశారు. వాయనాడ్‌లో పెద్దగా పనులు జరగడం లేదని ఆమె పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో 57,000 మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందలేదని, 130,000 ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు లేవని, భూ రికార్డుల డిజిటలైజేషన్ నెమ్మదిగా ఉందని, వాయనాడ్ జిల్లా పరిధిలో నివసించే గిరిజనుల్లో ‘సికిల్ సెల్ అనీమియా’ వ్యాధి ప్రధాన సమస్యగా ఉందని అధికారులు తన దృష్టికి తెచ్చినట్లు కేంద్ర మంత్రి అన్నారు.

Also read:OM Birla: లోక్‌సభ స్పీకర్ పేరుతో ఫేక్ అకౌంట్లు.. ఎంపీలకు మెసేజ్‌లు

కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని అమేథీ పార్లమెంటు స్థానం నుంచి భాజపా తరుపున పోటీ చేసిన స్మృతి ఇరానీ..రాహుల్ గాంధీ పై ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె విజయం సాధించారు. అమేథీ నియోజకవర్గంలో పోటీ చేస్తే రాహుల్ ఓడిపోవడం ఖాయమనే విశ్లేషకుల సూచనతో రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈక్రమంలో రానున్న 2024 ఎన్నికల నాటికీ వాయనాడ్ పార్లమెంటు స్థానాన్ని కూడా బీజేపీ చేజిక్కించుకోవాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Also read:Corona Next Season: మరోసారి కరోనా వ్యాప్తి తప్పదు: ఇజ్రాయెల్ పరిశోధకులు