Chidambaram: చిదంబరానికి కాంగ్రెస్ లాయర్ల నిరసన సెగ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరానికి ఆ పార్టీకి చెందిన లాయర్ల నుంచి నిరసన సెగ ఎదురైంది. చిదంబరం వృత్తిరీత్యా లాయర్ అనే సంగతి తెలిసిందే.

Chidambaram: చిదంబరానికి కాంగ్రెస్ లాయర్ల నిరసన సెగ

Chidambaram

Chidambaram: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరానికి ఆ పార్టీకి చెందిన లాయర్ల నుంచి నిరసన సెగ ఎదురైంది. చిదంబరం వృత్తిరీత్యా లాయర్ అనే సంగతి తెలిసిందే. బుధవారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా కోర్టుకు ఒక కేసు విచారణ సందర్భంగా చిదంబరం హాజరయ్యారు. అయితే, ఆ కేసు విచారణ ముగించి బయటకు వస్తుండగా, అక్కడి లాయర్లలో కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి కారణం ఆయన ఆ కేసు వాదించటమే. బెంగాల్‌లో మెట్రో డైరీకి చెందిన షేర్లను అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రైవేటు సంస్థకు అమ్మేసింది.

Congress Tit-For-Tat : కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్.. రాహుల్ సరే.. ఇదో ఎవరో గుర్తుపట్టండి.. ఫొటో వైరల్..!

ప్రైవేటు సంస్థకు షేర్లు అమ్మడానికి వ్యతిరేకంగా, ఆ సంస్థపై బెంగాల్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసు వేసింది. ఈ కేసు విచారణ బుధవారం జరిగింది. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన చిదంబరం మాత్రం లాయర్‌గా కాంగ్రెస్ పక్షాన కాకుండా, ప్రైవేటు సంస్థ తరఫున హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ వేసిన పిటిషన్ తరఫున కేసు వాదిస్తున్న లాయర్లకు కోపం వచ్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సొంత పార్టీ కోర్టు ద్వారా చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాల్సింది పోయి, ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా వాదించడంపై లాయర్లు మండిపడ్డారు. చిదంబరానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు చిదంబరం అక్కడ్నుంచి వెళ్లిపోయారు.