Congress Tit-For-Tat : కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్.. రాహుల్ సరే.. ఇదో ఎవరో గుర్తుపట్టండి.. ఫొటో వైరల్..!
Prakash Javadekar : రాహుల్ గాంధీ (Rahul Gandhi) నైట్ క్లబ్ వీడియో వివాదం కొత్త మలుపు తిరిగింది. రాహుల్‌పై బీజేపీ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ ఇస్తోంది.

Prakash Javadekar Popped Champagne Too Congress' Tit For Tat Post
Prakash Javadekar : రాహుల్ గాంధీ (Rahul Gandhi) నైట్ క్లబ్ వీడియో వివాదం కొత్త మలుపు తిరిగింది. రాహుల్‌పై బీజేపీ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ ఇస్తోంది. రాహుల్ గాంధీ వీడియో ద్వారా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేపీ నేతలు. కానీ, బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ ఖండిస్తూనే మరోవైపు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. రాహుల్ వ్యక్తిగత ట్రిప్‌లో భాగంగా నేపాల్ వెళ్లారని, నేపాల్ భారత్‌కు మిత్రదేశమని వివరణ ఇచ్చింది. రాహుల్ గాంధీ వివాహ వేడుకకు వెళ్లారంటూ రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు.
అంతేకానీ, ప్రధాని మోదీలా మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో వేడుకకు వెళ్లలేదు కదా.. అంటూ ఆయన విమర్శించారు. షరీఫ్‌తో కలిసి మోదీలా రాహుల్ కేక్ కట్టింగ్ చేయలేదని కాంగ్రెస్ నేతలు బీజేపీపై రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. రాహుల్ వీడియోను వైరల్ చేస్తున్న బీజేపీ నేతలకు కౌంటర్ ఎటాక్‌గా కాంగ్రెస్ నేత మాణక్కం ఠాగూరు ట్వీట్ చేశారు. బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ (Prakash Javadekar)కు సంబంధించిన ఫొటోలను ఆయన పోస్టు చేశారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా అంటూ ఠాగూరు ట్వీట్ చేశారు.
Who is this ? ? pic.twitter.com/dVuiiHGpEL
— Manickam Tagore .B??✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 3, 2022
ప్రకాశ్ జవదేకర్ ఫొటోతో ట్వీట్‌ను కాంగ్రెస్ నేతలు వైరల్ చేస్తున్నారు. బీజేపీ పార్టీ త్వరలో బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని కూడా నేరంగా ప్రకటిస్తుందేమో అంటూ కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రాహుల్ నేపాల్‌లో ఉన్నట్టు ఖాట్మండు పోస్ట్ లో వెల్లడించింది. రాహుల్‌తో పాటుగా ఫొటోలో నేపాల్‌లోని చైనా రాయబారి కూడా ఉన్నారు. దాంతో ఈ వివాదం మరింత తీవ్రకావడానికి ఇదే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Read Also : Rahul Gandhi: రాహుల్ నైట్ పార్టీ.. కాంగ్రెస్, బీజేపీ ట్విట్టర్ వార్