కేజ్రీ ధర్నాకు బాబు

  • Publish Date - February 13, 2019 / 01:31 AM IST

ఢిల్లీ : ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలో జంతర్‌ మంతర్‌ దగ్గర నిరసన కార్యక్రమం జరుగనుంది. ఈ నిరసన మోదీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం జరిగే ఈ నిరసనలో కాంగ్రెస్‌ మినహా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ హాజరవుతున్నాయి. ఈ ధర్నాలో ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, శరద్‌యాదవ్‌, శరద్‌ పవార్‌తోపాటు 20మందికిపైగా విపక్ష పార్టీల నాయకులు పాల్గొననున్నారు. ఢిల్లీకి ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ చేరుకున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.