Toll Plazas End : టోల్‌ప్లాజాలు లేని హైవేలు త్వరలోనే

ఏ టూరో లేదా పనిమీదో కారు వేసుకుని బయలుదేరి హైవేమీదకు వెళ్లామా..టోల్ ఫీజులతో జేబులు ఖాళీ అయిపోయేవి. కానీ త్వరలో ఆ బాధ తప్పుతుందంటున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి. త్వరలోనే టోల్‌ప్లాజాలు లేని హైవేలను చూస్తారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Toll Plazas will End : ఏ టూరో లేదా పనిమీదో కారు వేసుకుని బయలుదేరి హైవేమీదకు వెళ్లామా..టోల్ ఫీజులతో జేబులు ఖాళీ అయిపోయేవి. కానీ త్వరలో ఆ బాధ తప్పుతుందంటున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి. త్వరలోనే టోల్‌ప్లాజాలు లేని హైవేలను చూస్తారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. బుధవారం (ఆగస్టు 11,8.2021) మంత్రి ప్రీమియర్‌ ఇండస్ట్రీ చాంబర్‌ (సీఐఐ) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ..జాతీయ రహదారులపై టోల్‌ సేకరణ కోసం ప్లాజాలకు బదులుగా.. కేంద్రం జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను తీసుకురాబోతుందని ప్రకటించారు. దీని కోసం రాబోయే మూడునెలల్లో కొత్త పాలసీ తీసుకురానున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో జిపిఎస్ ద్వారా టోల్ వసూలు చేసే టెక్నాలజీ లేదని.. కానీ ప్రభుత్వం అటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. టోల్ బూత్‌లను ప్రభుత్వం త్వరలో తొలగిస్తుందని దాని స్థానంలో పూర్తిగా GPS- ఎనేబుల్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అమలు చేయబడుతుందని తెలిపారు. 2022లో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ సేకరణ వ్యవస్థ అమలులోకి వస్తుందన్నారు.

ఈ సందర్భంగానే మంత్రి మాట్లాడుతూ..రోడ్ల నిర్మాణంలో పాలుపంచుకుంటున్న అన్ని కంపెనీలు స్టీల్‌, సిమెంట్‌ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. వాటి ధర, పరిణామాన్ని తగ్గించేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు