×
Ad

Madavi Hidma: మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నేత హిడ్మా హతం

హిడ్మా భార్య కూడా మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించిన సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి.

Madavi Hidma: మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నేత మడావి హిడ్మా (44) హతమయ్యాడు. అతడి భార్య కూడా మృతి చెందినట్లు సమాచారం. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులోనే హిడ్మా హతమయ్యాడు. హిడ్మాపై రూ.కోటికి పైగా, హిడ్మా భార్య హేమపై రూ.50 లక్షల రివార్డ్ ఉంది.

ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో కూంబింగ్‌ జరిగింది. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించిన సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

Also Read: సజ్జనార్ గారు.. మా వాడు వెధవే కానీ.. ఈ ఒక్క పనిచేయండి దండం పెడతా.. ఇమ్మడి రవి తండ్రి కన్నీరుపెట్టించే రిక్వెస్ట్

కాగా, భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మా పేరొందాడు. మావోయిస్టు పార్టీలో ఎన్నో ఏళ్లు ఉంటున్న అతడు కనీసం ఎలా ఉంటాడన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. 25 క్రితం నాటి ఫొటోనే ఇన్నాళ్లూ కనపడిది. ఈ ఏడాది జూన్‌లో మాత్రం కొత్త ఫొటో బయటకు వచ్చింది. భారత బలగాలకు హిడ్మా ఇన్నాళ్లపాటు చిక్కకుండా తిరిగాడు.

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చిలోపు మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను పెద్ద ఎత్తున కొనసాగిస్తోంది.