Tourists Rush Shimla : సిమ్లాలో ఆంక్షలు ఎత్తివేత.. పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్!

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో హిమాచల్ ప్రదేశ్ కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. కరోనా ఆంక్షల సడలింపుతో పర్యాటక ప్రాంతమైన సిమ్లాలో పర్యాటకులతో సందడిగా మారింది. జూన్ 14 నుంచి ఆంక్షల సడలింపులు అమల్లోకి రావడంతో పర్యాటకులు పోటెత్తారు.

Tourists rush to Shimla after eases Covid curbs : కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో హిమాచల్ ప్రదేశ్ కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. కరోనా ఆంక్షల సడలింపుతో పర్యాటక ప్రాంతమైన సిమ్లాలో పర్యాటకులతో సందడిగా మారింది. జూన్ 14 నుంచి ఆంక్షల సడలింపులు అమల్లోకి రావడంతో పర్యాటకులు పోటెత్తారు. కరోనా ఆంక్షల సడలింపులతో పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు తరలివస్తున్నారు.

పర్వానూ సమీపంలో ఉన్న ఇంటర్-స్టేట్ క్రాసింగ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో డజన్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల కోవిడ్ ఇ-పాస్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కరోనా కర్ఫ్యూను ఎత్తివేయడంతో పాటు సెక్షన్ 144ను కూడా ఎత్తివేసింది అక్కడి ప్రభుత్వం. గతవారమే హిమాచల్ ప్రదేశ్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ఉత్తర భారతదేశంలోని పర్యాటకులు సేద తీరేందుకు కొండలపైకి వెళుతున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశానికి పర్యాటక ప్రాంతానికి వచ్చే పర్యాటకుల్లో RT-PCR నెగటివ్ వంటి చూపించాల్సిన అవసరం లేదు. అంతరాష్ట్ర ప్రజా రవాణా 50 శాతం ఆక్యుపెన్సీతో పనిచేయడానికి అనుమతించారు. దుకాణాల ప్రారంభ సమయం సోమవారం నుంచి ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు పెంచారు.

గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్‌లో కొత్తగా 237 కొవిడ్-19 కేసులు నమోదు కాగా.. ఏడు మరణాలు నమోదయ్యాయి, అందులో ఐదు మరణాలు కాంగ్రా జిల్లా నుంచి నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 855 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 19,85,50 పాజిటివ్ కేసులు ఉన్నాయి, వీటిలో 4,777 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 19,03,77 మంది రోగులు కోలుకోగా, 3,375 మంది మరణించారు.

ట్రెండింగ్ వార్తలు