Tragedy : యూపీలో వివాహ వేడుకలో విషాదం.. బావిలో పడి 13 మంది మహిళలు మృతి

ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Died 1

Tragedy at a wedding ceremony : ఉత్తరప్రదేశ్ లో వివాహ వేడుకలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు 13 మంది మహిళలు బావిలో పడి మృతి చెందారు. వీరిలో 9 మంది బాలికలు ఉన్నారు. ఖుషీనగర్ జిల్లా నెబువా నౌరంజియాలో వివాహ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్ జరుగుతోంది. ఈ క్రమంలో కొంతమంది మహిళలు, యువతులు బావి పైకప్పుపై నిల్చున్నారు.

అయితే బరువు అధికమవ్వడంతో పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అందరూ బావిలో పడిపోయారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. మరో 15 మందిని గ్రామస్తులు రక్షించారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

UP Bus Accident : యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు బీభత్సం.. ఆరుగురు మృతి

ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.