బాణసంచా వెలిగించి దానిపై కూర్చున్నాడు.. ఆ తర్వాత ఘోరం జరిగిపోయింది..

దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bengaluru Tragedy (Photo Credit : Google)

Bengaluru Tragedy : ఫ్రెండ్ అంటే కష్టాల్లో తోడుగా ఉండేవాడు. బాధను దూరం చేసే వాడు. ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు. ఇబ్బందుల్లో ఉంటే ధైర్యం చెప్పి ఆదుకునే వాడే స్నేహితుడు అంటే. ఇలా.. ఫ్రెండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, ఫ్రెండ్ షిప్ పేరుతో కొందరు చేసే పనులు.. స్నేహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ఫ్రెండ్ పేరుతో రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఎదుటి వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి ప్రాణం తీయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా బెంగళూరులో దారుణం జరిగింది. ఫ్రెండ్స్ అంతా కలిసి.. పందెం పేరుతో ఒక వ్యక్తి ప్రాణం తీశారు.

దీపావళి పండుగ రోజున బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. ఫ్రెండ్స్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ఒక యువకుడు.. ఏకంగా తన ప్రాణాలనే పొగొట్టుకున్నాడు. టపాసు అంటించి దానిపై కూర్చుని చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో జరిగింది. కోననకుంటెలో నివాసం ఉండే శబరీశ్ (32)కు అతడి ఫ్రెండ్స్ ఒక ఛాలెంజ్ విసిరారు. బాణసంచాను వెలిగించి దానిపై కూర్చోవాలని, ఆ సవాల్ గెలిస్తే ఆటోరిక్షా కొనిస్తామని చెప్పారు. ఆటో వస్తుందన్న ఆశతో ఆ యువకుడు టపాసుపై కూర్చున్నాడు. అది ఒక్కసారిగా పేలడంతో లేచి కిందపడిపోయాడు. పేలుడు ధాటికి శబరీశ్ అక్కడికక్కడే చనిపోయాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నవంబర్ 1వ తేదీన సాయంత్రం వేళ ఈ ఘటన జరిగింది. కాగా, ఆ సమయంలో శబరీశ్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. శబరీశ్ స్నేహితులు అంతా కలిసి రోడ్డుపై టపాసుల బాక్స్ ను ఉంచారు. ఆ తర్వాత వెలిగించారు. వారంతా దూరంగా వెళ్లిపోయారు. శబరీశ్ ఆ బాక్స్ పై కూర్చున్నాడు. ఇంతలో భారీ శబ్దంతో క్రాకర్స్ బాక్స్ పేలిపోయింది. పవర్ ఫుల్ బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ ఎంత శక్తివంతంగా ఉందంటే.. ఆ పేలుడు ధాటికి శబరీశ్ స్పాట్ లోనే ప్రాణాలు వదిలాడు. శబరీశ్ మృతితో అతడి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. స్నేహితులు చేసిన పిచ్చి పనికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. నిజానికి.. సవాల్ గెలిస్తే ఆటోరిక్షా ఇస్తామని సరదాగా చెప్పారట. అయితే, అది నిజం అనుకుని శబరీశ్ సవాల్ ను స్వీకరించి తన ప్రాణాలే పొగొట్టుకున్నాడు.

 

 

Also Read : ‘డిజిటల్ అరెస్ట్’తో తస్మాత్ జాగ్రత్త.. అనుమానం వస్తే వెంటనే రిపోర్టు చేయండి : నిపుణుల హెచ్చరిక!