Wall Collapse In Noida: నోయిడాలో విషాదం.. గోడకూలి నలుగురు మృతి.. మరో తొమ్మిది మందికి..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నోయిడాలోని సెక్టార్ 21లోని జలవాయు విహార్‌లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీ ప్రహారీ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగు మరణించారు. తొమ్మిది మందికి ..

Noida wall collapse

Wall Collapse In Noida: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నోయిడాలోని సెక్టార్ 21లోని జలవాయు విహార్‌లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీ ప్రహారీ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగు మరణించారు. తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గోడకూలిన సమయంలో చాలామంది అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల నుండి 12 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. మరికొంత మంది శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. బుల్ డోజర్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మృతులకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ సంతాపం తెలిపారు. సీనియర్ అధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారికి తగిన చికిత్స అందించాలని ట్విటర్ ద్వారా తెలిపారు.

జలవాయు విహార్ వద్ద డ్రెయినేజీ పనులను నోయిడా అథారిటీ కాంట్రాక్టుకు ఇచ్చింది. ఇక్కడ ఇటుకలను తొలగిస్తుండగా గోడ కూలిపోయినట్లు తమకు సమాచారం వచ్చిందని నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ సాహస్ తెలిపారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే క్షతగాత్రులను ఇప్పటికే గుర్తించామని, మరెవరైనా శిథిలాల కింద చిక్కుకుపోయారేమో అనే అనుమానంతో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు.