రైలు ప్రమాదం..ఇంజన్‌తో సహా పక్కకు ఒరిగిన 24 బోగీలు

Train accident on Kirandol Araku line : విశాఖ కొత్తవలస-కిరండోల్‌ అరకు లైన్‌లో రైలు ప్రమాదం జరిగింది. కిరండోల్‌ నుంచి విశాఖపట్నంకు ఐరన్‌ఓర్‌ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ ట్రైన్‌ ప్రమాదానికి గురైంది. చత్తీస్‌ఘడ్ లోని దిమిలి రైల్వేస్టేషన్‌ వద్ద ఈ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్‌తో సహా 24 బోగీలు పక్కకు ఒరిగాయి.

ఈ ఘటనలో మూడు ఎలక్ట్రికల్ ఇంజిన్లు ధ్వంసమయ్యాయి. లోకో పైలెట్లకు గాయాలైనట్లు సమాచారం. ఇంజిను వెనక భాగంలో ఉన్న దాదాపు 6 గూడ్స్ వ్యాగన్లు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. ఈ క్రమంలో ట్రాక్ కూడా పాడైనట్లు తెలుస్తోంది.

గూడ్స్ రైలు కెకె లైన్ లోని జగదల్పూర్ దాటిన తర్వాత దిమిలి రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.