×
Ad

Plane Crashed : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కూలిన శిక్షణ విమానం

Plane Crashed : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో శిక్షణ విమానం కూలిపోయింది. నగర శివారంలోని ఓ చెరువులో విమానం కూలిపోయింది.

Training plane crashes

Plane Crashed : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో శిక్షణ (రెండు సీట్ల) విమానం కూలిపోయింది. నగర శివారంలోని కేపీ కాలేజీ మైదానం వెనుక ఉన్న చెరువులో విమానం కూలిపోయింది. భారత వైమానిక దళం (IAF) కు చెందిన ఈ విమానం శిక్షణ సమయంలో నేలకూలింది.

శిక్షణ విమానం కూలిపోయిన సమయంలో అందులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అయితే, ప్రమాదం తరువాత వారు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు.