Ananya Kumari Alex : కేరళ ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ట్రాన్స్‌జెండర్‌ ఆత్మహత్య

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన ట్రాన్స్‌జెండర్‌ అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్య చేసుకున్నారు. కొచ్చి సమీపంలోని ఎడప్పల్లిలోని తన ఇంట్లో మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా అనారోగ్యమే ఆమె ఆత్మహత్యకు కారణమని తెలుస్తుంది.

Ananya Kumari Alexa

Ananya Kumari Alex : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన ట్రాన్స్‌జెండర్‌ అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్య చేసుకున్నారు. కొచ్చి సమీపంలోని ఎడప్పల్లిలోని తన ఇంట్లో మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా అనారోగ్యమే ఆమె ఆత్మహత్యకు కారణమని తెలుస్తుంది. ట్రాన్స్‌జెండర్‌ మారేందుకు అనన్య కుమారి ఆరుసార్లు సర్జరీలు చేయించుకున్నారు.. సర్జరీలవల్లనే ఆమె అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.

అయితే తనకు ఆపరేషన్ చేసిన వైద్యులపై గతంలో ఆరోపణలు చేసింది అనన్య.. తన ఆరోగ్యం విషయంలో వైద్యులు సరైన శ్రద్ద చూపలేదని అందుకే తాను అనారోగ్యానికి గురయ్యానని తెలిపారు. వైద్యులపై న్యాయపోరాటం చేస్తానని వివరించారు. సర్జరీలు జరిగి ఏడాది అయినా నొప్పులు తగ్గలేదని ఆమె తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆ నొప్పులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.

కాగా కేరళలో తోలి ట్రాన్స్‌జెండర్‌ రేడియో జాకీ అనన్యనే.. ఇక ఈమె తాజాగా జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో.. వెంగర నియోజకవర్గం నుంచి కుంజలికుట్టిపై పోటీ చేశారు. డెమొక్రాటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగిన అనన్య ఎన్నికలకు ఒకరోజు ముందు మీడియా సమావేశం నిర్వహించి తనకు ఓటు వెయ్యొద్దని తెలిపారు. తన సొంతపార్టీ వారే తన ఓటమికి కుట్రలు చేస్తున్నారని తెలిపారు.

ఈ ప్రకటన అనంతరం ఆమె డెమొక్రాటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈమె మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.