Turkish Influencer Who Went Viral For Marrying Herself end life
Turkish Influencer : టర్కిష్ టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ కుబ్రా అయ్‌కుట్.. “వెడ్డింగ్ వితౌట్ ఎ గ్రూమ్” అనే వీడియోలతో ఫుల్ ఫేమస్ అయింది. తనను తానే పెళ్లి చేసుకున్న ఈ 26 ఏళ్ల యువతి అనూహ్యంగా ప్రాణాలను వదిలింది. టర్కీ మీడియా నివేదికల ప్రకారం.. ఇస్తాంబుల్‌లోని సుల్తాన్‌బేలీ జిల్లాలోని లగ్జరీ అపార్ట్‌మెంట్ భవనంలోని ఐదవ అంతస్తు నుంచి టిక్‌టాక్ స్టార్ అయికుట్ దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక అధికారులు నివేదికల ప్రకారం.. ఆమె మృతదేహంతో పాటు సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. ఆమె ఆకస్మిక మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : Motorola Moto G85 : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G85పై బిగ్ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
చివరిగా టిక్‌టాక్ వీడియోలో.. :
టిక్‌టాక్ స్టార్ అయ్‌కుట్ మరణానికి ముందురోజు సోషల్ మీడియాలో ఆమె చివరి పోస్ట్‌లను చూస్తే.. చాలా ఆందోళనగా ఉన్నట్టు కనిపించిందని అభిమానులు అంటున్నారు. ఆమె మరణానికి కొన్ని గంటల ముందు తాను బరువు తగ్గడం గురించి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టును పెట్టింది.
ఆమె తన చివరి పోస్ట్‌లో, ”నేను నా శక్తిని సేకరించాను. కానీ, నేను బరువు పెరగడం లేదు. నేను ప్రతిరోజూ ఒక కిలో బరువు తగ్గుతాను. ఏమి చేయాలో నాకు తెలియదు. నేను అత్యవసరంగా బరువు పెరగాలి” అని తన చివరి టిక్‌టాక్ వీడియోలో వాపోయింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి కొద్దిసేపటి ముందు తన అపార్ట్‌మెంట్‌ను శుభ్రం చేస్తూ వీడియోలో కనిపించింది.
తనను తానే పెళ్లిచేసుకున్న కుబ్రా :
ముఖ్యంగా, 2023లో టిక్‌టాక్‌లో అసాధారణమైన “వెడ్డింగ్ విత్ ఎ గ్రూమ్” సిరీస్‌తో అయ్‌కుట్ గుర్తింపుతెచ్చుకుంది. ఆమె సింబాలిక్‌గా తనను తానే పెళ్లి చేసుకుంది. తెల్లటి గౌను, తలపాగా ధరించి.. “నాకు తగిన వరుడిని నేను కనుగొనలేకపోయాను” అని ప్రకటించింది. ఆమె తన పుష్పగుచ్ఛాన్ని తీసుకుని ఉత్సాహంగా కారులో వెళుతూ కనిపించింది. మరో వైరల్ క్లిప్‌లో ఆమె తన వివాహ దుస్తులలో హాస్యభరితంగా బర్గర్‌ను ఆస్వాదిస్తూ తనను తాను ” వినూత్న వధువు”గా పేర్కొంది.
షాకింగ్‌లో ఫాలోవర్లు :
ఆమె మరణ వార్త సోషల్ మీడియా అభిమానులను షాకింగ్ గురిచేసింది. ఆమె ఫాలోవర్లను కలిచివేసింది. అనేక మంది అభిమానులు, శ్రేయాభిలాషులు తమ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయ్ కుట్ “అందమైన మనస్సు కలిగిన దేవదూత”గా అభిమానులు గుర్తు చేసుకున్నారు.
మరోవైపు.. టర్కీ అధికారులు అయ్‌కుట్ మరణం వెనుక పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. టిక్ టాక్ స్టార్ స్వస్థలంలోనే ఆమె తల్లిదండ్రులు నివసిస్తున్నారు. ఆమె అంత్యక్రియలను అక్కడే నిర్వహించనున్నారు. అనేక మంది తోటి టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆమె అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించాలని భావిస్తున్నారు.