Vijay Vs Udhayanidhi Stalin: అటు విజయ్, ఇటు ఉదయనిధి స్టాలిన్.. ఇక తమిళనాడులో నవతరం రాజకీయాలు స్టార్ట్..! రసవత్తరంగా అసెంబ్లీ..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సంచలనం సృష్టించారు. పోటీ చేసిన రెండు చోట్ల నుంచి ఆయన గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ బరిలోకి దిగారు.
Vijay Vs Udhayanidhi Stalin: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. విజయ్ కింగ్ మేకర్ అవుతారని అంతా అంచనా వేశారు. కానీ ఏకంగా కింగ్ అయ్యారు. నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 50ఏళ్లకు పైగా కొనసాగిన డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి గండికొట్టింది. ఎంట్రీతోనే సెంచరీ కొట్టి తన సత్తా ఏంటో చూపించారు
గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల రాజకీయ ప్రవేశానికి భిన్నంగా విజయ్ రాజకీయం నడిపారు. యువతను, మార్పు కోరుకునే వర్గాలను ఏకం చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ ఫలితాలతో తమిళ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైందని భావిస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సంచలనం సృష్టించారు. పోటీ చేసిన రెండు చోట్ల నుంచి ఆయన గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ బరిలోకి దిగారు. ఆ రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. పెరంబూర్ లో డీఎంకే అభ్యర్థి శేఖర్ పై 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తిరుచ్చి ఈస్ట్ లో 20వేల ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు. పెరంబూరు చెన్నై నగర శివారులో ఉంటుంది.
విజయ్ తమిళనాడు సీఎం కావడం పక్కాగా మారింది. అటు ప్రస్తుత సీఎం స్టాలిన్ ఎవరూ ఊహించని రీతిలో ఓటమి చవిచూశారు. స్టాలిన్ ఓడిపోయినా.. డీఎంకే రెండో అతిపెద్ద పార్టీగా మారితే.. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో తమిళనాడు అసెంబ్లీ అత్యంత రసవత్తరంగా మారనుంది. విజయ్, ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ సినీ నటులే. ఇద్దరూ హీరోలే. పైగా ఇద్దరూ యంగ్ లీడర్స్ కూడా. దీంతో తమిళనాట నవతరం రాజకీయాలు స్టార్ట్ కానున్నాయి. అసెంబ్లీలో ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు, డైలాగ్ వార్ నెక్ట్స్ లెవెల్ లో ఉండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: తమిళ రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ.. అక్కడ నుంచే పోటీ.. ఏకంగా డిప్యూటీ CM..?
