Lingayat seer Shivamurthy: లింగాయత్ గురువు శివమూర్తిపై అత్యాచారం కేసులో ట్విస్ట్.. బాలికలు చెప్పింది అబద్ధమా?
ఈ కేసు ఫైల్ చేసిన మరో అమ్మాయి వైద్య పరీక్షలకు అంగీకరించింది. అయితే లైంగిక చర్య తనపై జరగలేదని చెప్పింది. పరీక్షల అనంతరం కూడా అదే విషయం వెల్లడైంది. ఈ సాక్ష్యాల్ని కోర్టుకు సమర్పించారు. పోలీసుల నివేదిక ప్రకారం, వార్డెన్ రష్మీ ద్వారా రాత్రి పూట సదరు గురువు ఉన్న గదిలోకి బాలికల్ని బలవంతంగా పంపించేదని ఆరోపణలు వచ్చాయి

Twists and turns in rape case against Karnataka's Lingayat seer Shivamurthy
Lingayat seer Shivamurthy: లింగాయత్ గురువు శివమూర్తిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమా? ఆయన ఆశ్రమంలో జరిగినట్లు చెప్తున్న అరాచకాలు అబద్ధమా? అంటే అవుననే విషయాలే వెల్లడవుతున్నాయి. శివమూర్తి సహా మరికొందరిపై అత్యాచార ఆరోపణలు చేసిన ఇద్దరు బాలికలు విచారణ సందర్భంగా చెప్పిన విషయాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ముందుగా తమపై పలుమార్లు అత్యాచారం జరిగినిట్లు ఫిర్యాదు చేసిన ఆ బాలికలు, తాజాగా అలాంటిదేమీ జరగలేదని చెప్పడం గమనార్హం.
Makar Sankranti: సంక్రాంతి వేడుకలో పతంగి ఎగురవేస్తూ హుషారుగా కనిపించిన అమిత్ షా
ఆగస్టు 26, 2022న, కర్ణాటకలోని చిత్రదుర్గలోని లింగాయత్ మఠంలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఇద్దరు మైనర్ బాలికలు మైసూరులోని నజరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తదనంతరం, ఈ కేసులో శివమూర్తి మురుగ శరణారావు సహా రష్మి (మురుగ మఠం వార్డెన్), పరమశివయ్య (మఠం కార్యదర్శి), జూనియర్ పోంటిఫ్, గంగాదరియా (మఠం న్యాయవాది)లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Manish Sisodia: తన కార్యాలయంలో మళ్లీ సీబీఐ సోదా చేసిందన్న సిసోడియా.. అదేం లేదన్న సీబీఐ
శివమూర్తిపై అత్యాచారం, లైంగిక వేధింపుల అభియోగాలు మోపారు. ఫిర్యాదు చేసిన బాలికలలో ఒకరు పోలీసులతో మాట్లాడుతూ “పదే పదే లైంగిక వేధింపులు” జరిగినట్లు వెల్లడించింది. అయితే వైద్య పరీక్షలకు ఆమె అంగీకరించలేదు. విచిత్రంగా గత సెప్టెంబర్‌లో తనపై లైంగిక వేధింపులే జరగలేదని ప్రభుత్వ వైద్యుడికి చెప్పింది. శారీరక పరీక్ష అనంతరం వైద్యుడు ఒక నివేదికను ఇచ్చాడు. బాలికపై ఎలాంటి లైంగిక చర్య జరగలేదని, జననేంద్రియాలు, పెరెనియంకు ఎటువంటి గాయాలు లేవని ఆ నివేదికలో స్పష్టం చేశాడు.
Amartya Sen: ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీ అయితే బెటర్.. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్
ఇక, ఈ కేసు ఫైల్ చేసిన మరో అమ్మాయి వైద్య పరీక్షలకు అంగీకరించింది. అయితే లైంగిక చర్య తనపై జరగలేదని చెప్పింది. పరీక్షల అనంతరం కూడా అదే విషయం వెల్లడైంది. ఈ సాక్ష్యాల్ని కోర్టుకు సమర్పించారు. పోలీసుల నివేదిక ప్రకారం, వార్డెన్ రష్మీ ద్వారా రాత్రి పూట సదరు గురువు ఉన్న గదిలోకి బాలికల్ని బలవంతంగా పంపించేదని ఆరోపణలు వచ్చాయి. దీని అనంతరం అమ్మాయిలు జూలై 24న మఠం ప్రాంగణం నుండి బాలికలు వెళ్లిపోయారు. అయితే జులై 23 నుంచి 28 మధ్య తాను మారిషస్‌లో మతపరమైన పర్యటనలో ఉన్నానని లింగాయత్ గురువు కోర్టు ముందు రికార్డులు చూపించారు.
TamilNadu: గవర్నర్‌పై డీఎంకే నేతల వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడ్డ బీజేపీ
ఇక ఇదే కేసులో మరో సాక్షి చెప్పిన విషయాలు కూడా కలగాపులగంగా ఉన్నాయి. ఎస్కే బసవరాజన్ అనే వ్యక్తి 2007 వరకు మఠంలో నిర్వాహకుడిగా పనిచేశాడు. మఠంలోని హాస్టల్‌లో ఉన్న బాలికలతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడడం సరికాదని శివమూర్తితో చెప్పడంతో తనను బహిష్కరించినట్లు బసవరాజన్ తెలిపాడు. కానీ మఠంలో హాస్టల్ 2012 అనంతరం నిర్మించారు. ఇన్ని కారణాలను చూస్తుంటే ఫిర్యాదులు అవాస్తవం అని తేలుతున్నాయి. అయితే తుది తీర్పు వచ్చే వరకు ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని తేల్చలేము.