కాశ్మీర్‌లో టెన్షన్ : ఆపిల్స్ ట్రక్కు డ్రైవర్లను చంపిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్‌లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. షోఫియాన్ జిల్లాలో ఆపిల్స్‌ను సరఫరా చేస్తున్న ట్రక్కులే లక్ష్యంగా దాడికి దిగారు. ఇద్దరు ట్రక్కు డ్రైవర్లను కాల్చిచంపారు. అనంతరం వాహనాలకు నిప్పుపెట్టారు. మరో ట్రక్కు డ్రైవర్‌ను తీవ్రంగా గాయపర్చారు. విషయం తెలుసుకున్న జవాన్లు… వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల్లో ఒకరిని రాజస్థాన్ అల్వార్‌కు చెందిన మహ్మద్ ఇలియాస్‌గా గుర్తించారు. వారం రోజుల క్రితమే ఇదే జిల్లాలో ఓ ఆపిల్ వ్యాపారిని హత్య చేశారు. కశ్మీర్ నుంచి ఆపిల్ రవాణా పూర్తిస్థాయిలో జరుగుతుండటంతో దాన్ని అడ్డుకునేందుకే ఉగ్రవాదులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని సైన్యం అంటోంది.
కశ్మీర్ ప్రజలను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు. అక్కడి యాపిల్ పళ్ల వ్యాపారులపై దాడులకు దిగుతుండడం టెన్షన్ కలిగిస్తోంది. దీంతో వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. షోపెయిన్ లో ఓ పళ్ల డీలర్‌ను ఉగ్రవాదులు చంపేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనివల్ల తాము వ్యాపారం చేయలేకపోతున్నామని, భయం..భయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జమ్ము, పంజాబ్ రక్షణశాఖ స్థావరాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన కొద్దిసేపటికే ఉగ్రవాదులు తెగబడటం కలకలం రేపింది. పొట్ట కూటికోసం పని చేసుకునే వారిని కూడా టెర్రరిస్టులు టార్గెట్ చేయడంతో డ్రైవర్లు, కూలీలు కశ్మీర్ నుంచి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజస్థాన్ ట్రక్కు డ్రైవర్, ఓనర్‌ను కూడా ఉగ్రవాదులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. వీరిలో ఒక ఉగ్రవాది పాకిస్థాన్‌కు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Read More : డై హార్డ్ ఫ్యాన్స్.. వయలెంట్‌గా ఉన్నారు: థియేటర్లు పగల గొట్టారు.. పోలీసు వాహనాలు తగలబెట్టారు