Covid-19 Vaccine : కొవిడ్ టీకా తీసుకున్నారా? రెండు డోసులకు ఒకటే మొబైల్ నెంబర్‌ తప్పనిసరి..!

Covid-19 Vaccine : కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? రెండు డోసులు అయ్యాయా? లేదా మొదటి డోసు మాత్రమే తీసుకున్నారా? కొవిడ్ టీకా తీసుకునేవారు తప్పనిసరిగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఒకటే ఉండాలి.

Covid-19 Vaccine : కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? రెండు డోసులు అయ్యాయా? లేదా మొదటి డోసు మాత్రమే తీసుకున్నారా? కొవిడ్ టీకా తీసుకునేవారు తప్పనిసరిగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఒకటే ఉండాలి. రెండు డోసులకు ఒకే మొబైల్ నెంబర్ ద్వారా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. మొదటి డోసు ఒక మొబైల్ నెంబర్, రెండో డోసుకు మరో మొబైల్ నెంబర్ వినయోగించవద్దని సూచించింది. ఎందుకంటే.. రెండు డోసులు ఒకే మొబైల్ నెంబర్ ద్వారా తీసుకుంటే రెండు డోసులు తీసుకున్నట్టుగా పరిగణిస్తారు. లేదంటే.. మొదటి డోసు మాత్రమే తీసుకున్నట్టుగా నిర్ధారించే అవకాశం ఉంది.

దీనివల్ల కొవిడ్ పోర్టల్‌లో నమోదు చేయడం ఇబ్బందికరంగా మారుతుందని కేంద్రం తెలిపింది. ఇటీవల పుణెకు చెందిన 2.5 లక్షల మంది మొదటి కొవిడ్ డోసును రెండు సార్లు తీసుకున్నారంటూ సర్టిఫికేట్లు వచ్చాయని వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.. ప్రస్తుతానికి కొవిడ్ పోర్టల్‌లో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేసింది. రెండు డోసులు తీసుకున్నట్టు సర్టిఫికేట్ రావాలంటే తప్పనిసరిగా ఒకే మొబైల్ నెంబర్ ద్వారా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.

Two Doses Of Covid 19 Vaccine Must Be Taken With Single Mobile Number Only

అలా కాకుండా వేర్వేరు ఫోన్ నెంబర్లతో రెండు డోసులు తీసుకుంటే మాత్రం.. కొవిడ్ పోర్టల్ లో నమోదు చేయడం కష్టమని సూచించింది. పేరు, వయస్సు, జెండర్ బట్టి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను జారీ చేయడం ఇబ్బందికరంగా మారుతుందని కేంద్రం అభిప్రాయపడింది. డేటా ఎంట్రీ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఏదో టెక్నికల్ ఇష్యూగా పరిగణించరాదని తెలిపింది.

ఒకవేళ మొదటి డోసు రెండు సార్లు తీసుకున్నట్టు సర్టిఫికేట్లు వచ్చి ఉంటే.. వారు కొవిడ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. కొవిడ్ పోర్టల్ లో ‘Raise An Issue’ ఫీచర్ ద్వారా టీకా నమోదు వివరాల్లో లోపాలను సరిదిద్దుకోవచ్చునని సూచించింది. కొవిడ్ టీకా సర్టిఫికేషన్‌లో ఏదైనా తప్పులు కనిపిస్తే మీకు దగ్గరలోని రిజిస్ట్రేషన్ సిబ్బంది లేదా అధికారిక హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా హెల్ప్ తీసుకోవచ్చునని కేంద్రం వెల్లడించింది.

Read Also : Covid-19 Update : దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 3,207 కేసులు, 29 మరణాలు

ట్రెండింగ్ వార్తలు