వేటగాళ్లబారికి ఎన్నో వన్యమృగాలు బలైపోతున్నాయి. అటవీ చట్టాల ప్రకారం అధికారులు ఎన్ని పట్టిష్టమైన ఏర్పాట్లు చేసినా వేటగాళ్లకు బలైపోతునే ఉన్నాయి. ఈ క్రమంలో రెండు చిరుత పులి చర్మాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు చిరుత పులి చర్మాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని చొవరి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వద్ద పోలీసులు ఈ చిరుతపులుల చర్మాలను గుర్తించారు. పులిచర్మాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అటవీ, జంతు సంరక్షణ చట్టాల కింద కేసు నమోదు చేశారు.
Two leopard skins recovered from an individual in Chowari, Himachal Pradesh. The accused has been arrested and case has been registered under the Wildlife Protection Act. pic.twitter.com/7CY5JEi1rV
— ANI (@ANI) May 14, 2019