Lockdown Reliefకు రూపాయి విరాళమిచ్చిన మద్రాస్ హైకోర్టు లాయర్లు

Lockdown Reliefకు రూపాయి విరాళమిచ్చిన మద్రాస్ హైకోర్టు లాయర్లు

Updated On : April 19, 2020 / 7:12 AM IST

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా లక్షల మంది పేదవాళ్లు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా కదిలివచ్చి విరాళాలిస్తుంటే. మద్రాస్ హైకోర్టుకు చెందిన ఇద్దరు లాయర్లు బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు, పుదుచ్చేరీలకు లాక్‌డౌన్ రిలీఫ్ ఫండ్ చెరొక రూపాయి ఇచ్చారట. మరో ఇద్దరు లాయర్లు ఒక్కొక్కరు పది రూపాయలు ఇచ్చారు.

ఈ అమౌంట్ ఈ ట్రాన్సఫర్ మోడ్ రూపంలో కౌన్సిల్ కు సంబంధించిన బ్యాంకు అకౌంట్లకు వెళుతుంది. ఇప్పటి వరకూ బార్ కౌన్సిల్ రూ.60లక్షల రూపాయలు సేకరించింది. ఈ మేరకు ఇటువంటి స్టార్ డొనార్లకు పొగడ్త కింద.. ‘స్పిరిట్ ఆఫ్ గివింగ్’ పేరుతో సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటున్నారు. వెబ్ సైట్లో డొనేషన్స్ ఇచ్చిన వారి వివరాలు కూడా పొందుపరుస్తారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్, సీనియర్ అడ్వకేట్ ఎస్ ప్రభాకరన్ ఆ నలుగురు లాయర్ల పూర్తి వివరాలు వెల్లడించారు. లాక్‌డౌన్ రిలీఫ్ ఫండ్ కోసం వారు కదిలివచ్చిన తీరుకు అప్రిసియేషన్ సర్టిఫికేట్ అందచేస్తామంటున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు, పుదుచ్చేరి నిధుల సేకరణలో చురుగ్గా పాల్గొంది. ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని వందల కొద్దీ లాయర్లు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేశారు.

జస్టిస్ ఎస్ఎమ్ సుబ్రహ్మణ్యం రూ.2.5లక్షలు విరాళమిచ్చారు. చాలా మంది టాప్ లాయర్లు ఒక్కొక్కరు రూ.5లక్షలు చొప్పున ఇచ్చారు. విరాళాలు ఇచ్చిన 216మందిలో ఇద్దరు రూ.1ఇవ్వగా మరో ఇద్దరు రూ.10ఇచ్చారని ప్రభాకరణ తెలిపారు. ఒక వ్యక్తి రూ.101ఇస్తే, మరో ఇధ్దరు ఒక్కొక్కరు రూ.200 ఇస్తే చాలా మంది రూ.500 అంతకంటే ఎక్కువ ఇచ్చారు. .

‘డొనేషన్ అనేది స్వచ్ఛంగా చేయాల్సిన పని. ఒకరికి ఇష్టం ఉండొచ్చు మరొకరికి కాకపోవచ్చు. కానీ, ఇంత తక్కువ మొత్తంలో ఇచ్చి విరాళం ఇచ్చాననిపించుకోకూడదు’ అని మద్రాస్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ పాల్ కనగరాజ్ అన్నారు.