Uttarakhand : చెడు అలవాటులతో చెడిపోవడమే కాకుండా.. మూగజీవిని బలవంతం చేసి ఏమి చేశారో చూడండి

కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే దారిలో ఇద్దరు వ్యక్తులు ఓ గుర్రాన్ని చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా దానితో సిగరెట్ కాల్పించడానికి ప్రయత్నించారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.

Uttarakhand

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఇద్దరు వ్యక్తులు గుర్రంతో బలవంతంగా గంజాయి తాగిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు.

చేతులతో నడుస్తూ కేదార్ నాథ్ కు ప్రదక్షిణలు చేసిన పూజారి

కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే దారిలో ఇద్దరు వ్యక్తులు జంతు హింసకు పాల్పడిన ఘటన బయటకు వచ్చింది. ఓ గుర్రాన్ని ఇబ్బంది పెడుతూ బలవంతంగా గంజాయి సిగరెట్ కాల్పిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. హిమాన్షి మెహ్రా (Himanshi Mehra) అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి షేరైన ఈ వీడియోపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంతో మంది పర్యాటకులు తిరిగే ప్రాంతంలో ఈ రకంగా జంతు హింసకు పాల్పడటంపై పలువురు మండిపడుతున్నారు. గుర్రం నోరు, ముక్కు మూసి దానిని చిత్రవధకు గురి చేస్తూ ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన చేష్టలు జంతు ప్రేమికులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

Uttarakhand : స్త్రీలు ఒంటిపై 80% కప్పుకుంటేనే ఉత్తరాఖండ్ ఆలయాల్లోకి అనుమతి ఇస్తారట

ఈ వీడియోపై ఉత్తరాఖండ్ పోలీసులు స్పందించారు. గుర్రంతో బలవంతంగా గంజాయి తాగిస్తున్న వీడియో చూసామని వీడియోలోని వ్యక్తుల్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎవరి దృష్టికి వచ్చినా పోలీసు ఎమర్జెన్సీ నంబర్లలో తమకు తెలియజేయాలని కూడా పోలీసు శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక ఈ వీడియో చూసినవారంతా జంతువులను హింసించడాన్ని వ్యతిరేకిస్తూ వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.