Uttarakhand : స్త్రీలు ఒంటిపై 80% కప్పుకుంటేనే ఉత్తరాఖండ్ ఆలయాల్లోకి అనుమతి ఇస్తారట

ఇకపై శరీరంపై నిండుగా దుస్తులు ధరించిన వారికే ఉత్తరాఖండ్ ఆలయాల్లోకి ప్రవేశం ఉంటుందట. ముఖ్యంగా మహిళలు 80% తమ శరీరాన్ని కప్పి ఉంచాలని అక్కడి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Uttarakhand  : స్త్రీలు ఒంటిపై 80% కప్పుకుంటేనే ఉత్తరాఖండ్ ఆలయాల్లోకి అనుమతి ఇస్తారట

Uttarakhand News

Uttarakhand News : దేశ వ్యాప్తంగా పలు దేవాలయాల్లో స్త్రీ, పురుషుల ప్రవేశానికి డ్రెస్ కోడ్ ఉంది. అయితే సరిగా అమలు కావట్లేదు. అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఉత్తరాఖండ్ దేవాలయాల్లో అనుమతి విషయంలో అధికారులు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. డ్రెస్ కోడ్ పాటించని స్త్రీ, పురుషులకు ఇకపై లోనికి అనుమతి ఉండదు. ముఖ్యంగా స్త్రీలు 80% ఒంటిపై దుస్తులు కప్పుకుని ఉండాలని ఆలయ అధికారులు చెబుతున్నారు.

TTD: శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయంలో వీడియో తీసిన భక్తుడిని గుర్తించిన అధికారులు.. అతడు ఎవరంటే?

దేశ వ్యాప్తంగా కొన్ని ఆలయాల్లో ప్రవేశానికి డ్రెస్ కోడ్ ఉంది. అయితే కొన్ని చోట్ల సరిగా అమలు కావట్లేదు. ముఖ్యంగా స్త్రీ, పురుషులు శరీరంపై నిండుగా వస్త్రాలను కప్పుకుని ఆలయంలోకి రావాలని చాలాచోట్ల నియమాలున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, రిషికేశ్, డెహ్రాడూన్ జిల్లాల్లోని ఆలయాల్లో కఠిన నియమాలు అమలు చేయబోతున్నారు. స్త్రీలు 80% శరీరం కప్పి ఉంచే దుస్తులు ధరించాలని చెబుతున్నారు. లేదంటే ఆలయంలోకి అనుమతి లభించదు. ఈ విషయాన్ని మహానిర్వాణి పంచాయతీ అఖారా కార్యదర్శి రవీంద్ర పూరి తెలిపారు.

Ujjain Mahakal : ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో కూలిపోయిన సప్తరుషుల విగ్రహాలు

డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన స్త్రీ, పురుషులకు ఆలయాల్లోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అధికారికంగా అమలు అవుతున్న ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని చెప్పారు. త్వరలో దేశ వ్యాప్తంగా ఉన్న అఖారా అనుబంధ ఆలయాలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. ఆలయ కమిటీకి తరచు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిషేధం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.