TTD: శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయంలో వీడియో తీసిన భక్తుడిని గుర్తించిన అధికారులు.. అతడు ఎవరంటే?

TTD: ఆ భక్తుడు చాకచక్యంగా మొబైల్ ఫోన్ ను ఆలయంలోకి తీసుకెళ్లాడని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

TTD: శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయంలో వీడియో తీసిన భక్తుడిని గుర్తించిన అధికారులు.. అతడు ఎవరంటే?

TTD

TTD: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయంలో వీడియో తీసిన భక్తుడిని గుర్తించి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఓ భక్తుడు శ్రీవారి గర్భగుడి వరకు మొబైల్ తీసుకెళ్లి, ఫొటోలు, వీడియోలు తీసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

దీనిపై అధికారులు విచారణ జరిపించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇవాళ దీనిపై మాట్లాడుతూ… నిందితుడిని తెలంగాణకు చెందిన రాహుల్ రెడ్డిగా గుర్తించినట్లు తెలిపారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అతడిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

భద్రతా వైఫల్యాలూ ఉన్నాయని, అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యం కారణంగానే భక్తుడు వీడియో తీశాడని అన్నారు. సీవీఎస్‌వో నివేదికలు ఇచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీటీడీ సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని అన్నారు.

భక్తుడు చాకచక్యంగా మొబైల్ ఫోన్ ను ఆలయంలోకి తీసుకెళ్లాడని తెలిపారు. సీసీకెమెరా ఫుటేజీలు పరిశీలించి, వీడియో ఎవరు తీశారన్న విషయాన్ని గుర్తించామన్నారు. శ్రీవారిని గంటకు 5,500 మంది భక్తులు దర్శించుకుంటారని తెలిపారు. ప్రతిభక్తుడిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తే గంటకు 5,500 మందిని లోపలికి అనుమతించడం సాధ్యం కాదని చెప్పారు.

శ్రీవారి ఆలయంలోకి మొబైల్ తీసుకెళ్లి ఆనంద నిలయాన్ని వీడియో తీసిన వ్యక్తి .. భద్రతపై మండిపడతున్న భక్తులు