Tirumala : శ్రీవారి ఆలయంలోకి మొబైల్ తీసుకెళ్లి ఆనంద నిలయాన్ని వీడియో తీసిన వ్యక్తి .. భద్రతపై మండిపడతున్న భక్తులు

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. పటిష్టమైన భద్రత ఉన్నా ఓ భక్తుడు శ్రీవారి గర్భగుడి వరకు మొబైల్ తీసుకెళ్లటం వివాదాస్పదంగా మారింది.

Tirumala : శ్రీవారి ఆలయంలోకి మొబైల్ తీసుకెళ్లి ఆనంద నిలయాన్ని వీడియో తీసిన వ్యక్తి .. భద్రతపై మండిపడతున్న భక్తులు

Tirumala

Tirumala : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. పటిష్టమైన భద్రత ఉన్నా ఓ భక్తుడు శ్రీవారి గర్భగుడి వరకు మొబైల్ తీసుకెళ్లటం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనతో శ్రీవారి ఆలయం భద్రతపై భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భద్రతా వైపల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆదివారం (మే 7,2023) ఓ భక్తుడు శ్రీవారి ఆనంద నిలయం (గర్భగుడి) వరకూ మొబైల్ ఫోన్ ను తీసుకెళ్లాడు. గర్భగుడిని అత్యంత సమీపం నుంచి ఫోటోలు, వీడియోలు తీశాడు. అక్కడి ఆగకుండా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారడంతో భక్తులు టీటీడీ అధికారులపై మండిపడుతున్నారు. ఇదేనా స్వామివారి ఆలయానికి భద్రత అంటూ ప్రశ్నిస్తున్నారు. భక్తుడు సెల్ ఫోన్ తో గర్భగుడి దాకా వెళుతుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు.

kanipakam varasiddhi vinayaka : సోషల్ మీడియాలో కాణిపాకం వరసిద్ధి వినాయకుడు మూలవిరాట్ ఫోటోలు .. మండిపడుతున్న భక్తులు

కాగా..శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ ను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. పలు దశలో భక్తుల్ని తనిఖీలు చేసి లోపలికి పంపిస్తారు. కానీ ఓ భక్తుడు ఇన్ని భత్రతా వలయాల్ని దాటుకుని సెల్ ఫోన్ పట్టికెళ్లాడు అంటే అది కచ్చితంగా భద్రతా వైఫల్యమే అంటున్నారు భక్తులు.పలు దశల్లో సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం సెల్ ఫోన్ తో గర్భగుడి దాకా వెళ్లటమే కాదు అక్కడ ఫోటోలు, వీడియోలు తీస్తున్నా సెక్యురిటీ సిబ్బంది పట్టించుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది. శ్రీవారి ఆనంద నిలయాన్ని బయటి నుంచి వీడియో తీసినా అక్కడి సిబ్బంది పట్టించుకోకపోవటం పలు విమర్శలకు దారితీసింది.

విమాన వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కుతున్న దృశ్యాలతో పాటు గర్భగుడి కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. సోమవారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తిరుమల విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ సదరు భక్తుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సదరు భక్తుడిని గుర్తించి చర్యలు తీసుకోనున్నారు.