చేతులతో నడుస్తూ కేదార్ నాథ్ కు ప్రదక్షిణలు చేసిన పూజారి

  • Published By: nagamani ,Published On : June 22, 2020 / 09:54 AM IST
చేతులతో నడుస్తూ కేదార్ నాథ్ కు ప్రదక్షిణలు చేసిన పూజారి

Updated On : June 22, 2020 / 9:54 AM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం కేదరనాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది.. గుడి చుట్టూ కొత్తరకంగా  ప్రదక్షిణ చేశారు. ఆదివారం జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సంతోష్ త్రివేది చేతులపై ప్రదక్షిణలు చేశారు. చేతులపై ప్రదక్షిణలు ఏంటీ అనుకుంటున్నారు. అదేనండీ చేతులతో..తలకిందులుగా నడుస్తూ..కేదార్ నాత్ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆదివారం (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆయన ఇలా ప్రదక్షిణ చేయడం విశేషం.

కాగా..యోగాలో సాధన చేస్తే..చేతులతో నడవొచ్చు..నీటిలో తేలొచ్చు..గాలిలోనే కూర్చోవచ్చు..నస్సుని..శరీరాన్ని యోగాతో అధినంలోకి తెచ్చుకున్న ఎంతోమంది అత్యద్భుతమైన ఆసనాలువేసి ఆశ్చర్యపరిచిన సందర్భాలు చాలానేఉన్నాయి. 

Read: మధుర క్షణాలు : మనుమరాలికి ఆట నేర్పిస్తున్న బామ్మ..