మావోల దాడి  : పోలీసులు అనుకొని ఇద్దరు గర్భిణీలపై 

  • Publish Date - March 21, 2019 / 04:02 AM IST

ఛత్తీస్‌గఢ్ : మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్ లో నిత్యం పోలీసులపై దాడులకు తెగబడే మావోలు ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీసుల వాహానాన్ని టార్గెట్ చేసిన మావోయిస్టులు..పోలీస్ వాహనంగా భ్రమపడి..ఓ ప్రయివేట్ వాహనంపై మందుపాతర పేల్చారు. ఈ పేలుడు ధాటికి వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు గర్భిణిలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారితో పాటు మరో 9 మంది కూడా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడికి గురైన బొలెరో వాహనం దంతెవాడ నుంచి బీజాపూర్ వెళ్తుండగా.. బుధవారం మార్చి 20  సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే బీజాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. 

దండకారణ్యంలో మావోల దాడి నిత్యకృత్యంగా మారిపోయిన సందర్భంలో సోమవారం  (మార్చి 19)న దంతెవాడలో మావోయిస్టులు దాడి చేయడంతో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. మావోల ప్రాబల్యం అధికంగా ఉండటంతో ఛత్తీస్‌గఢ్‌లో లోక్ సభ ఎన్నికలను మూడు దశలుగా నిర్వహిస్తున్నారు.