×
Ad

Road Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఆదిలాబాద్ రిమ్స్ విద్యార్థులు మృతి

బైక్ పై వెళ్తున్న రిమ్స్ విద్యార్థులు అర్ధరాత్రి యావత్మాల్ జిల్లా పాండ్రకవడ సమీపంలో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు.

  • Published On : December 18, 2023 / 09:24 AM IST

ROAD ACCIDENT (1)

Maharashtra Road Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు రిమ్స్ వైద్య విద్యార్థులు మృతి చెందారు. మరో విద్యార్థికి గాయాలు అయ్యాయి. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.

ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఆరుగురు వైద్య విద్యార్థులు రెండు బైక్ లపై మహారాష్ట్రలో వెళ్తున్నారు. బైక్ పై వెళ్తున్న రిమ్స్ విద్యార్థులు అర్ధరాత్రి యావత్మాల్ జిల్లా పాండ్రకవడ సమీపంలో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో డేవిడ్, బాలసాయి అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

Dawood Ibrahim : అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం…ఆసుపత్రిలో చేరిక

మృతి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు 2020 బ్యాచ్ కు చెందిన వారుగా గుర్తించారు. విద్యార్థులు మృతి చెందిన వార్త తెలిసి ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.