Cruelty on Animals: స్కూటీపై వెళ్తూ కుక్కను ఈడ్చుకెళ్లిన మహిళలు
పంజాబ్‌లోని పట్యాలాకు చెందిన ఇద్దరు మహిళలను జంతులను క్రూరంగా హింసించినట్లుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. చంచల్, సోనియాలు పట్యాలా గ్రామస్థులు.

Dog Pulling
Cruelty on Animals: పంజాబ్‌లోని పట్యాలాకు చెందిన ఇద్దరు మహిళలను జంతులను క్రూరంగా హింసించినట్లుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. చంచల్, సోనియాలు పట్యాలా గ్రామస్థులు. వారి స్కూటీకి కుక్కను కట్టి నగర వీధుల్లో తిప్పారు.
జూన్ 20న నమోదైన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. జంతువులను క్రూరంగా హింసించిన అంశంపై కేసు నమోదుగా కాగా వారిద్దరూ బెయిల్ పై విడుదల అయ్యారు. వాళ్లు చేసిన పనికి జూన్ 24న గాయాలతో ఇబ్బందిపడ్డ కుక్క ప్రాణాలు పోగొట్టుకుంది.