snake-news
రెండేళ్ల బాలుడు తాచుపాము బారి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక బెలగావి జిల్లా కంగ్రేలిలో చోటుచేసుకుంది. తండ్రి వేదాంత్ అనే రెండేళ్ల తన కుమారుడిని పొలానికి తీసుకెళ్లాడు. కుమారుడు ఆడుకుంటుండగా తండ్రి వీడియో తీస్తున్నాడు. అప్పుడు ఓ భారీ తాచుపాము అక్కడ కనిపించడంతో బాలుడు దాని తోక పట్టుకునేందుకు ప్రయత్నించారు.
అప్రమత్తమైన తండ్రి కొడుకును తీసుకొచ్చేందుకు పరుగెత్తగా పాము చిన్నారికి ఎలాంటి అపాయం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.